Tirupati Laddu Controversy: ఏపీలో సంచలనం సృష్టించిన తిరుమల లడ్డూ వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.. సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో దూకుడు తగ్గించింది సిట్.. ఈ నెల 3వ తేదీ వరకు పోలీస్ గెస్ట్ హౌస్‌కు సిట్ పరిమితంకానుంది.. అయితే, గత మూడు రోజుల్లో కీలకమైన ఆధారాలు సేకరించారు సిట్ అధికారులు.. ఇక, తిరుమలలో మీడియాతో మాట్లాడిన ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు.. 3వ తేదీ వరకు సిట్ విచారణ నిలిపివేశామని ప్రకటించారు.. తదుపరి సుప్రీంకోర్టు ఆదేశాలు మేరకు విచారణ ఉంటుందన్నారు.. కల్తీ నెయ్యి పై అంశంపై ఏర్పాటైన సిట్ బృందం పరిశీలన జరుపుతున్న సమయంలో.. సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో సిట్ దర్యాప్తు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు వెల్లడించారు డీజీపీ..
Read Also: Minister Nara Lokesh Praja Darbar: రీసర్వేలో గ్రామకంఠంగా పట్టా భూమి.. మంత్రి లోకేష్‌కి ఫిర్యాదు
మరోవైపు.. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లుపై అధికార్లతో సమీక్షించిన డీజేపీ ద్వారకా తిరుమలరావు.. బ్రహ్మోత్సవలు సందర్భంగా మొదటి రోజు సీఎం చంద్రబాబు నాయుడు పట్టు వస్ర్తాల సమర్పణ, ఐదోవ రోజు గరుడ వాహన సేవ రోజున అదనంగా భధ్రతా ఏర్పాట్లు చేస్తాం అన్నారు.. నాలుగు వేల మంది పోలీసులతో భధ్రతా ఏర్పాట్లు చేస్తామన్న ఆయన.. సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భధ్రతా ఏర్పాట్లు చేశామన్నారు.. అనుమానితులను ముందస్తుగా గుర్తించేలా ఏర్పాట్లు చేస్తాం.. 2700 సీసీ కెమెరాలతో పాటు అదనంగా బాడీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం అన్నారు.. అనుమానితులను గుర్తించేందుకు ఫ్రింగర్ ప్రింట్ వ్యవస్థను వినియోగిస్తాం.. సోషియల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం కాకుండా నిఘా వుంచుతామని పేర్కొన్నారు. గ్యాలరీలో 2 లక్షల మంది భక్తులు విక్షీంచే అవకాశం వుండగా.. అదనంగా 80 వేల మంది భక్తులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యూ లైన్‌ల ద్వారా అనుమతిస్తాం అన్నారు.. 2.5 లక్షల మంది ప్రయాణించేలా గరుడ సేవ రోజున ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తున్నాం.. భక్తులు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తే సౌకర్యవంతంగా ఉంటుంది.. దసరా సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో అదనపు ఛార్జీలు ఏమీ ఉండవని స్పష్టం చేశారు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు.