Vizag Tiger: అనకాపల్లిలో కుక్కపై పులి దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనకాపల్లిలో మళ్లీ రాయల్ బెంగాల్ టైగర్ కలకలం రేపుతోంది. గతరాత్రి అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గంధవరం గ్రామంలో పులి సంచారంతో రైతులు ఆందోళనకు దిగారు. పులి పెయ్య మీద కాళ్ళు వేసి పీక్కుని తింది. దీంతో రైతు వెంకటరావు… అక్కడకు తమ పెంపుడు కుక్కలతో వెళ్లారు. ఆ సమయంలో పులిని చూసి ఆందోళనకు గురయ్యాడు రైతు. అతని పెంపుడు కుక్క పులిపై దాడి చేయగా పులి పెయ్యను వదిలి కుక్కను…ఎత్తుకోని పోయిందని రైతు చెబుతున్నారు. దీంతో పోలీసులు అటవీ శాఖ అధికారులు సంఘటన స్దలానికి చేరుకొని పులి జాడకోసం తగు చర్యలు తీసుకుంటున్నారు.
ఇంతకుముందే ఆవులు, గేదెలపై పులి దాడులకు తెగబడింది. అనకాపల్లి మండలం బవులవాడ శివారులోని ఒక పశువుల పాకలో రెండురోజుల క్రితం ఒక ఆవు దూడను చంపేసి, సమీపంలోని పోతుకొండపైకి ఈడ్చుకెళ్లింది. కొంత భాగాన్ని తినేసి అడవుల్లోకి వెళ్లిపోయింది. అంతకుముందు కాకినాడ జిల్లాలోని వివిధ అటవీ ప్రాంతాల్లో పులి సంచరించి భయభ్రాంతులకు గురిచేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు, తుని నియోజకవర్గాల పరిధిలోని అటవీ ప్రాంతంలో సుమారు నెల రోజులపాటు సంచరించి, అటవీ శాఖ ఏర్పాటు చేసిన బోన్లుకు చిక్కకుండా తప్పించుకుంది.
Also Read
- Cyclone Arnab Landfall: తీరం దాటిన అర్నబ్ తుఫాన్.. మరో 6–7 గంటలు కీలకం!
- Cyclone Arnab: అలర్ట్.. ఏపీని వణికిస్తున్న తుఫాను.. అర్నబ్ నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ.. భారీ వర్ష సూచన..
- Cyclone Arnab: ఉప్పాడ తీరంలో రాకాసి అలల బీభత్సం.. 30 ఇళ్లు నేలమట్టం, కాకినాడ బీచ్ రోడ్డు ధ్వంసం!
- Cyclone Arnab: వేలాది ఎకరాల్లో నేలకొరిగిన అరటి, చెరకు తోటలు.. కోట్లలో నష్టం.. కన్నీరుమున్నీరవుతున్న రైతులు!
తరువాత గత నెల 27వ తేదీన అనకాపల్లి కోటవురట్ల, నక్కపల్లి మండలాల సరిహద్దు అటవీ ప్రాంతంలోకి ప్రవేశించింది. అనకాపల్లి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 15 రోజుల నుంచి పెద్దపులి సంచరిస్తుంది. పులిని బంధించేందుకు అటవీ, జూ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి రావడం లేదు. రూట్ మారుస్తూ.. దాడులు చేస్తోంది పులి. వివిధ ప్రాంతాలలో పులికి సంబంధించిన కదలికలు రికార్డు అయ్యాయి. అయితే పులి మాత్రం తెలివిగా వ్యవహరిస్తోంది. ఒక్కోరోజు ఒక్కో ప్రాంతానికి వెళుతోంది పులి. పులిని త్వరగా పట్టుకోవాలని అనకాపల్లిలోని గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
తాజావార్తలు
-
SA vs AUS: మిచెల్ స్టార్క్ కన్నెర్ర.. సౌతాఫ్రికా ఆలౌట్!
-
Bengaluru Metro: “నేను వణికిపోతున్నా”.. మెట్రోలో మహిళ వీడియో వైరల్.. కేసు నమోదు
-
Team India Records: టీ20ల్లో రెండు ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసిన భారత్.. మరో జట్టుకు సాధ్యం కాదేమో!
-
Cyclone Arnab: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు..
-
Bandi Sanjay: కరువు మండలాల జాబితాపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం..
ట్రెండింగ్
-
ఐఫోన్‌కు పోటీగా vivo కొత్త ఫీచర్.. Apple ఎకోసిస్టమ్‌తో VIVO X500 సిరీస్ గ్లోబల్ లాంచ్.!
-
థియేటర్ అనుభవం ఓకే.. కానీ ఆ ధరకు ఎకరం భూమి కొనవచ్చుగా..! 115 అంగుళాల LG QNED evo AI Mini LED TV లాంచ్..
-
లిక్విడ్ కూలింగ్ ఆర్కిటెక్చర్, ప్రెజర్-సెన్స్ ట్రిగ్గర్లు, డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ప్రాసెసర్‌తో సరికొత్త సంచలనం Infinix GT 50 Pro లాంచ్.!
-
6000mAh బ్యాటరీ, IP64 రేటింగ్, ఆరేళ్ల అప్డేట్లతో భారత్‌లో Samsung Galaxy A08 విడుదల..!
-
10,000mAh బ్యాటరీ, 1.5K 165Hz OLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్‌తో REDMI K100 లాంచ్..!