Site icon NTV Telugu

Threatening calls: కోటంరెడ్డికి బెదిరింపు కాల్స్.. ఎడ్ల బండికి కట్టి వీధుల్లో ఈడ్చుకుపోతా..!

Kottamreddy

Kottamreddy

Threatening calls: నెల్లూరు రాజకీయాల్లో కాకరేపిన నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి ఇప్పుడు బెదిరింపుల పర్వం మొదలైందట.. తన ఫోన్‌ ట్యాపింగ్ చేశారని.. ఆరోపణలు చేసి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి బయటకు వెళ్లిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి కడప జిల్లా నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. కడప జిల్లాకు చెందిన అనిల్ అనే వ్యక్తి కోటంరెడ్డికి ఫోన్ చేసి తీవ్రస్థాయిలో హెచ్చరికలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితో పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని విమర్శిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్‌ ఇచ్చారట.. తీరు మార్చుకోకపోతే.. నెల్లూరుకి వచ్చి ఎడ్ల బండికి కట్టి వీధుల్లో ఈడ్చుకుపోతానని కోటం రెడ్డిని హెచ్చరించారట.. అంతేకాదు.. చెన్నైలో కోటంరెడ్డికి ఎన్ని ఆస్తులు ఉన్నాయో తనకు తెలుసునని.. వాటిని బయట పెడతానని బెదిరింపులకు పాల్పడ్డారట.. కోటం రెడ్డికి బెదిరింపు కాల్స్ రావడంతో ఆయన తన సహచరులకు ఈ విషయాన్ని తెలియజేశారు. కడప నుంచి వస్తున్న బెదిరింపు కాల్స్ కు సంబంధించి రేపు మీడియా సమావేశం నిర్వహించనున్నారట కోటంరెడ్డి.

Read Also: Rama Prabha: నేను అడుక్కు తింటున్నానా.. ఎవడ్రా చెప్పింది మీకు..?

మరోవైపు.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి వరుస షాక్‌లు తగులుతున్నాయి.. ట్యాపింగ్‌ ఆరోపణలు చేసిన కోటంరెడ్డిపై ఎదురుదాడికి దిగిన వైసీపీ.. ఆ తర్వాత పక్కన పెట్టేంది.. అయితే.. ఇప్పుడు కోటంరెడ్డికి కార్పొరేటర్లు షాక్ ఇస్తున్నారు. ఇంతవరకు ఆయనకు మద్దతుగా నిలిచిన జిల్లా పార్టీ మహిళా అధ్యక్షురాలు, 23 డివిజన్ కార్పొరేటర్ మొయిల్ల గౌరీతోపాటు మరో కార్పొరేటర్ మూలే విజయ భాస్కర్ రెడ్డిలు.. కొత్తగా నెల్లూరు రూరల్‌ నియోజకవర్గానికి వైసీపీ ఇంచార్జ్‌గా వచ్చిన ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డికి మద్దతు ఇస్తామని ప్రకటించారు. తాము వైయస్సార్ అభిమానులమని మొదటనుంచి వైఎస్‌ జగన్ కు మద్దతుగా ఉన్నామన్నారు. పార్టీ ప్రయోజనాలజిస్ట్రా ఆదాల వెంటే నడుస్తామని స్పష్టం చేశారు. కార్యాలయంలో కోటంరెడ్డి ఫ్లెక్సీలను కార్యకర్తలు చించి వేశారు.. ఈ విషయం తెలియడంతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పడారుపల్లిలోని విద్యా భాస్కర్ ఇంటికి వెళ్లి ఆయనను బెదిరించినట్టు కార్యకర్తలు తెలిపారు. ఈ సమాచారం తెలియడంతో ఆదాల వర్గీయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి ఫైర్‌ అయ్యారు.. నెల్లూరులో కార్పొరేటర్ విజయ భాస్కర్ రెడ్డిని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బెదిరించాలని చూడటం సరైన పద్దతి కాదన్న ఆయన.. సీఎం జగన్ ని ఎప్పుడైతే ఎదిరించావో అప్పుడే పార్టీకి దూరం అయ్యావు.. బెదిరింపులకు పాల్పడితే చూస్తూ ఊరుకోం.. వైసీపీ నుంచి గెలిచిన వాళ్ళందరూ సీఎం జగన్ వైపే ఉంటారు.. జగన్ కోసం నిలబడాలని చూసిన వారిని నువ్వు బెదిరించాలేని చాలా ఇబ్బంది పడతావు.. వైసీపీ వాళ్ళందరూ వైసీపీలోనే ఉంటారు.. నీతో రారు అని స్పష్టం చేశరాఉ.. శ్రీధర్ రెడ్డి వెళ్లిపోయిన వాడివి వెళ్లిపోయినట్లు ఉండు.. కార్పొరేటర్లు అందరూ ప్రజల కోసం ఉండాలనుకుంటున్నారు.. ప్రజలందరూ జగన్ కోసం నిలబడతారు.. నువ్వు బెదిరించాలని చూస్తే ఉపేక్షించం అని వార్నింగ్‌ ఇచ్చిన విషయం విదితమే.

Exit mobile version