తిరుపతిలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు.. దంపతుల కళ్లలో కారం కొట్టి.. ఆ పై కత్తితో దాడికి దిగారు.. పుంగనూరు మండల పరిధిలో చోటుచేసుకుంది ఈ ఘటన… మృతుని భార్య అనురాధ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని నెక్కుంది గ్రామానికి చెందిన రెడ్డప్ప కుమారుడు దాము 25 తన భార్య 23 అనురాధతో కలిసి అత్తగారింటికి వెళ్లి తిరిగి ప్రయాణం అయ్యారు.. సాయంత్రం ఏడు గంటల సమయంలో తుర్లపల్లి గ్రామ సమీపాన ఉన్న దొనబండ ప్రాంతానికి చేరుకోగానే.. గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు వచ్చి.. తమపై కారంపొడి చల్లి.. కత్తితో బెదిరించారని. నగలు ఇమ్మని కత్తితో బెదిరిస్తుండగా నా భర్త నగలు ఇవ్వొద్దని కేకలు వేయడంతో దుండగులు నా భర్తను వెంబడించి కత్తితో పొడవగా నేను తప్పించుకుని.. కేకలు వేస్తుండటంతో గ్రామస్థులు రావడంతో దుండగులు పరారైయ్యారని అనురాధ తెలిపింది.
Read Also: Tirumala Hundi Collection: తిరుమల హుండీ రికార్డు.. వరుసగా 8వ మాసంలోనూ..
అయితే, ఈ ఘటనలో దాము అక్కడక్కడ మృతి చెందారు.. కేకలు వేస్తూ భార్య అనురాధ తమ ఇంటికి చేరుకోగా బంధువులంతా సంఘటన స్థలానికి వెళ్లిరు.. అప్పటికే దుండగులు పారిపోయారు.. ఒక సంవత్సరం క్రితమే మృతుడికి పెళ్లి అయినట్లు తెలిపారు. పెళ్లి జరిగే ఒక ఏడాది తిరిగేలోపే హత్యకు గురికావడంతో.. దాము కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.. ఈ విషయం తెలుసుకున్న పుంగునూరు అర్బన్ సీఐ గంగిరెడ్డి ఎస్సై మోహన్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు పంచనామా నిమిత్తం తరలించారు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
