Minister Satya Kumar Yadav: కేంద్ర బడ్జెట్ గురించి ఇవాళ దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది అని మంత్రి సత్య కుమార్ యాదవ్ అన్నారు. 2047 నాటికి వికసిత భారత్ కల సాకారం అయ్యే దిశగా బడ్జెట్ ఉంది.. వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేస్తున్నాం.. రూ. 1.72 లక్షల కోట్లు వ్యవసాయానికి కేటాయించాం.. యూరియాపై సబ్సిడీని పెంచే విధంగా చర్యలు తీసుకున్నాం అని ఆయన వెల్లడించారు. వ్యవసాయానికి ఊతమిచ్చే విధంగా బడ్జెట్ ఉంది.. రాబోయే ఐదేళ్లలో 70 వేల మెడికల్ సీట్లు పెంచబోతున్నామన్నారు. హెల్త్ టూరిజంనీ కూడ పెంచబోతున్నాం.. వేరే దేశాల ప్రజలు ఇక్కడికొచ్చి వైద్యం తీసుకొనేలా ప్లాన్ చేస్తున్నామని మంత్రి సత్యకుమార్ తెలిపారు.
Read Also: Hamas-Trump: శనివారం మ.12 గంటల తర్వాత ఏం జరుగుతుందో తెలియదన్న ట్రంప్
ఇక, కూటమి లో గ్యాప్ ఉంది అనేది కేవలం దుష్ప్రచారం మాత్రమే అని ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు. ధర్మవరంలో కూడా పార్టీల మధ్య కూడా ఇటువంటి గ్యాప్ లేదు.. కేవలం క్షేత్రస్థాయిలో కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయని పేర్కొన్నారు. అయితే, 2047 నాటికి వికసిత భారత్ తయారవుతుంది.. అలాగే, జీబీఎస్ సిండ్రోమ్ పై నిరంతరం సమీక్ష నిర్వహిస్తున్నాం.. ఆందోళన పడొద్దు.. అన్ని కేంద్రాల్లో వ్యాక్సిన్ లు అందుబాటులో ఉంచాం.. బర్డ్ ప్లూ ఇంకా మనుషులకు సోకలేదు.. మనుషులకు సోకింది అనేది కేవలం అసత్య ప్రచారమేనని మంత్రి సత్యకుమార్ చెప్పుకొచ్చారు.