Site icon NTV Telugu

Tirumala Laddu: తిరుమల శ్రీవారి లడ్డూ కౌంటర్ లో చోరీ

Tirumalal

Tirumalal

తిరుమల లడ్డూ అంటే భక్తులకు ఎంతో ఇష్టం. తిరుమల వెళ్ళి వచ్చాక లడ్డూ ప్రసాదాల గురించి అంతా వాకబు చేస్తారు. అందునా అక్కడికి వెళ్లిన వారు తిరుమల లడ్డూలు ఎక్కువగా కొనుగోలు చేసి తీసుకువస్తారు. కలియుగ వైకుంఠం తిరుమలలో దొంగతనం జరిగింది. శ్రీవారి లడ్డూ కౌంటర్ లో దొంగతనం జరిగింది. కౌంటర్ బాయ్ నిద్రిస్తుండగా 2 లక్షల పైగా నగదును దోచుకెళ్ళాడు దుండగుడు. 36 నెంబర్ కౌంటర్ లో నిన్న అర్థరాత్రి ఘటన జరిగింది. ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వన్ టౌన్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు విజిలెన్స్ అధికారులు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. విజిలెన్స్ లోపం వల్ల ఇలా జరిగిందా? ఈ దొంగతనం వెనుక ఎవరున్నారనేది తేలాల్చి వుంది.

ఇదిలా ఉంటే ఈ చోరీ కేసులో పురోగతి లభించింది. సిసి పుటేజి ఆధారంగా నిందితుడిని గుర్తించారు పోలిసులు. గతంలో చోరిలుకు పాల్పడిన వ్యక్తే చోరి చేసినట్లుగా గుర్తించారు. నిందితుడిని అరేస్ట్ చెయ్యడానికి ప్రత్యేక టీంలు ఏర్పాటు చేశారని తెలుస్తోంది.

Read Also: Tamilnadu Minister: పార్టీ కార్యకర్తలపై రాళ్లు రువ్విన తమిళనాడు మంత్రి.. వీడియో వైరల్

తిరుమలలో ఇవాళ ఆన్ లైన్ లో ఫిబ్రవరి మాసంకు సంబంధించిన అంగప్రదక్షణ టోకెన్లు విడుదల చేసింది. క్షణాల్లోనే టోకెన్లు అమ్ముడయిపోయాయి. మధ్యాహ్నం 3 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేసింది టీటీడీ. శ్రీవారి ఆలయంలో బాలాలయం కారణంగా ఫిబ్రవరి 22 నుంచి 28వ తేదీ వరకు టిక్కెట్ల జారీ నిలిపివేసింది. ఇదిలా ఉంటే తిరుమలలో డ్రోన్ కెమేరాల షాట్ల వ్యవహారం విమర్శల పాలవుతోంది.

తిరుమలలో భద్రత కొరవడిందని భక్తుల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. డ్రోన్ ఎగురవేయడంపై టీటీడీ ఈఓ ధర్మారెడ్డి వివరణ ఇచ్చారు. భద్రతపై ఎక్కడా రాజీపడబోమని, తిరుమలలో హై సెక్యూరిటీ వ్యవస్థ ఉందని అన్నారు. డ్రోన్ల వ్యవహారంపై ఇప్పటికే కేసు నమోదు అయిందని వెల్లడించారు. త్వరలో కొండపై డ్రోన్ నియంత్రణ టెక్నాలజీ అందుబాటులోకి తెస్తామంటున్నారు అధికారులు.

Read Also: Car Romance: కామా తురాణం.. కదులుతున్న కారులోనే రొమాన్స్

Exit mobile version