కుప్పంలో ప్రత్యేక ఎన్నికల అధికారిని తొలగించాలి : టీడీపీ నేతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కుప్పం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నియమించిన ప్రత్యేక ఎన్నికల అధికారిని తొలగించాలని టీడీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషన్(ఎస్ఈసీ) ను కోరారు. శుక్రవారం టీడీపీ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజా, ఎమ్మెల్సీ అశోక్ బాబులతో కూడిన టీడీపీ బృందం ఎస్ఈసీని కలిసింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నామినేషన్ల పర్వంలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని, అధికార పార్టీకి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని, ప్రతిపక్ష టీడీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా వైసీపీ నేతలు అడ్డుకున్నారని ఆరోపించారు.
కుప్పంలో టీడీపీ అభ్యర్థిపై వైసీపీ దాడి చేసిందని, వైసీపీ అభ్యర్థుల నామినేషన్లని అధికారులే దగ్గరుండి వేయిస్తున్నారని, ప్రభుత్వ పథకాల లబ్ది పొందాలంటే వైసీపీకే ఓటేయాలని అధికారులే ఒత్తిడి తెస్తున్నారన్నారు. కుప్పంలో ప్రత్యేక ఎన్నికల అధికారిగా నియమించిన లోకేష్ వర్మను తప్పించాలని ఎస్ఈసీని కోరామని వెల్లడించారు.
Also Read
- Eluru Tragedy: ఏలూరు జిల్లాలో విషాదం.. జీడి మామిడి తోటలో తల్లీకూతుళ్ల అనుమానాస్పద మృతి!
- Gender Determination Racket : చిత్తూరు జిల్లాలో అక్రమ లింగ నిర్ధారణ రాకెట్ గుట్టురట్టు..
- Summer Holidays: విద్యార్థులకు భారీ శుభవార్త.. వేసవి సెలవులు పొడిగింపు.. ఎన్ని రోజుల వరకంటే..?
- Nara Lokesh : ఏపీ శాంతిభద్రతలను దెబ్బతీసేందుకు కుట్ర
కుప్పంలో వైసీపీ నిర్వహించిన సభలో అధికార పార్టీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడారని, ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ కుప్పంలో వైసీపీ సభ నిర్వహించిందన్నారు. కుప్పం స్పెషలాఫీసర్ వైసీపీ కార్యకర్తగా పని చేస్తున్నారని, ఎన్నికల్లో అక్రమాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఎస్ఈసీ మీదే ఉందని టీడీపీ నేతలు వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
RCB Fans: కప్ గెలిచిన ఆనందం కొన్ని క్షణాలు కూడా లేకపాయే.. ఆర్సీబీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..
-
Virat Kohli: నన్ను త్వరగా అవుట్ చేయాలని అందరూ చూస్తారు.. ఏం పర్లేదు, నా ప్లాన్స్ నాకుంటాయి!
-
Romantic Drama : తాగుబోతు ప్రేమకు ఇంత డిమాండా? ఐయండిబిలో 8.7 రేటింగ్
-
America vs Iran: కాస్కో ఇరాన్..! మీకు రెండే ఆప్షన్స్.. వినకపోతే లేపి పడేస్తాం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!
-
Dell XPS 13 (2026): డెల్ XPS 13 ల్యాప్‌టాప్ విడుదల.. 32GB RAM, 2.5K టచ్‌స్క్రీన్‌తో ఆకట్టుకుంటున్న కొత్త మోడల్
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!