14 నెలల్లో ప్లాంట్ ప్రారంభం ఓ మైలురాయి: సీఎం జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీ సిటీలో నోవా ఎయిర్ ప్లాంట్‌ను క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా సీఎం జగన్ ప్రారంభించారు. ఈ ప్లాంట్‌లో మెడికల్, లిక్విడ్ ఆక్సిజన్, లిక్విడ్ నైట్రోజన్, లిక్విడ్ ఆర్గోన్ వాయువుల తయారీ చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో నోవా ఎయిర్ ఎండీ గజనన్‌నబర్, కమర్షియల్ హెడ్ శరద్ మధోక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడారు. రోజుకు220 టన్నుల ఆక్సిజన్ తయారీ ఉత్పత్తి చేయడం ఈ ప్లాంట్ ఉద్దేశమన్నారు. కేవలం 14 నెలల్లో ప్లాంట్ ప్రారంభం కావడం అన్నది ఓ మైలురాయి అని జగన్ అన్నారు. ఇంత తక్కువ వ్యవధిలో ప్లాంట్ ప్రారంభం కావడం ఒక విశేషమన్నారు.దీంతో నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. 144 పీఎస్‌ఏ ప్లాంట్లు కూడా వివిధ ఆస్పత్రుల్లో ఇప్పటికే పెట్టామన్నారు. మరో 32 ప్లాంట్లు కూడా పెడుతున్నామన్నారు. దీనివల్ల ఆక్సిజన్ విషయంలో మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయని సీఎం జగన్ తెలిపారు. 24వేల ఆక్సిజన్ బెడ్లను సిద్ధం చేశామన్నారు. కోవిడ్ లాంటి విపత్తులు వచ్చినప్పుడు సరిపడా ఆక్సిజన్ అందుబాటులోకి వస్తుందన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 300 టన్నుల ఆక్సిజన్ తయారు అవుతుందన్నారు.ఈ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి దీనికి అదనంగా వచ్చి చేరుతుందని సీఎం పేర్కొన్నారు.
Read Also: ఉద్యోగుల ఆందోళనలకు, కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధం లేదు: విజయ్‌కుమార్
Also Read
- Nara Lokesh: కూటమిపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. “నో క్రాస్‌ఫైర్, నో మిస్‌ఫైర్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
- YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
- CM Chandrababu: ధరలకు కళ్లెం.. ద్రవ్యోల్బణం కట్టడికి సీఎం కీలక ఆదేశాలు
కోవిడ్‌కే కాదు, పరిశ్రమలకూ ఆక్సిజన్ చాలా ముఖ్యం: గజనన్ నబర్, నోవా ఎయిర్ ఎండీ
దేశంలో తొలిసారిగా ప్లాంట్ పెట్టామని ఎయిర్ ఎండీ, గజనన్ నబర్ అన్నారు. ఏపీ సరైన ప్రాంతమని ఎంచుకుని ఈ ప్లాంట్‌ను పెట్టామని తెలిపారు.మంచి మౌలిక సదుపాయాలు ఉన్నాయి.14 నెలల్లో ప్లాంట్‌ను నిర్మించామన్నారు. అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం ప్లాంట్ నిర్మాణానికి సహకరించారని వెల్లడించారు. కోవిడ్ వేవ్‌ల సమయంలో రవాణాకు, మానవవనరులకు కొరతలేకుండా అధికారులు చూశారన్నారు.

అందరీకీ కృతజ్ఞతలు అని గజనన్ అన్నారు. శ్రీ సిటీలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు ఉన్నాయన్నారు. గ్యాసెస్ తయారీలో మాకు అపారమైన అనుభవం ఉందన్నారు.అత్యాధునిక టెక్నాలజీని తీసుకు వచ్చాం. ఇండస్ట్రియల్ గ్యాసెస్ అందుబాటులో ఉండడంవల్ల సంబంధిత పరిశ్రమలకు మేలు జరుగుతుంది. పారిశ్రామికాభివృద్ధి కూడా జరుగుతుంది. అత్యంత భద్రతా ప్రమానాలో ప్లాంట ఏర్పాటు చేశామన్నారు. 1000 టన్నుల ఆక్సిజన్ స్టోరేజీకి కూడా ప్లాంట్‌లో ఏర్పాట్లు చేశామని గజనన్ నబర్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
-
BCCI Chief Selector: అజిత్ అగార్కర్ అవుట్.. చీఫ్ సెలెక్టర్ రేసులో ఆ ఇద్దరు మాజీ క్రికెటర్లు!
-
Gold and Silver Prices Today: గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం..
-
India vs Japan: భారత్, జపాన్ మధ్య చారిత్రాత్మక టీ20.. ‘స్నేహం కొత్త ఇన్నింగ్స్’ అంటూ జపాన్ అంబాసిడర్ పోస్ట్.!
-
PM Modi 76th Birthday: ప్రధాని మోడీ బర్త్‌డే స్పెషల్.. 2,500 దీపాలతో 25 అడుగుల సైకత శిల్పం..
ట్రెండింగ్
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!