ఈ సృష్టిలో చిత్ర విచిత్రాలు ఎన్నో.. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో కూడా ఎప్పుడో ఇలాంటి విషయాలు చెప్పారు. నీళ్ళతో దీపాలు వెలిగిస్తారు అంటూ విద్యుత్ శక్తి గురించి వివరించారు. యంత్రవాహనాల వల్ల ఎద్దులు లేకుండానే బళ్ళు నడుస్తాయన్నారు. వేపచెట్టు నుంచి పాలు స్రవిస్తాయన్నారు. అది నిజమయింది. ఒక వితంతువు 16 సంవత్సరాలు రాజ్యమేలుతుందన్నారు.. ఇందిరాగాంధీ విషయంలో అది నిజమయింది.
అడవి మృగాలు గ్రామాలు పట్టణాలలో ప్రవేశించి మానవులను చంపుతాయన్నారు. ఇప్పుడు తెలుగు రాష్టాల్లో ఏనుగులు, పులులు బీభత్సం కలిగిస్తున్నాయి. నది గండకి ఒడ్డున రాళ్ళు నృత్యం చేస్తాయన్నారు. నేపాల్ లో భూకంపం రూపాన ఇవే పరిణామాలు జరిగాయి. పంది కడుపున ఏనుగు పుడుతుంది. మేక కడుపున ఐదు తలల మేకపోతు పుడుతుందని రాశారు. ఇప్పుడు ఇవన్నీ నిజం అవుతున్నాయి. సాయిబాబా విగ్రహం పాలు తాగుతుందన్నారు. అదీ నిజమయింది. కొంతమంది మహిళలకు రెండు తలలతో పిల్లలు పుడుతుంటారు. రెండు శరీరాలు, ఒకే తలతో అవిభక్త కవలలు పుడతారు.
యజమాని పంపనబోయిన వెంకన్న
తాజాగా కాకినాడలో అదే జరిగింది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో రెండు తలల గొర్రె జన్మించింది. రెండు తలలతో జన్మించిన గొర్రె పిల్లను చూడడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి జనం తరలి వస్తున్నారు. రైతు పంపనబోయిన వెంకన్న పెంచుకుంటున్న గొర్రెకు రెండు తలల గొర్రె పిల్ల జన్మించింది. వివిధ జన్యులోపాల వల్ల ఇలాంటి గొర్రె పిల్లలు జన్మించే అవకాశం వుందని తెలుస్తోంది.
Read Also: Corona Deaths: చైనాలో చిన్నారుల ప్రాణాలు తీస్తున్న లాక్ డౌన్