ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2019 జూలై నుంచి చెల్లించాల్సిన 5.24 శాతం కరవు భత్యాన్ని విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన కరువు భత్యాన్ని 2022 జనవరి నెల జీతంతో కలిపి విడుదల చేసేందుకు గానూ ప్రభుత్వం ఆమోదం తెలియచేసింది. జనవరి జీతంతో కలిపి మూడు విడతలుగా పెరిగిన కరవు భత్యం చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
డీఏలో 10 శాతాన్ని ప్రాన్ ఖాతాలకు మిగతా 90 శాతం మొత్తాన్ని నేరుగా ఉద్యోగుల జీతాల ఖాతాలకు చెల్లించనున్నారు. జడ్పీ, మండల పరిషత్లు, గ్రామపంచాయితీలు, ఎయిడెడ్ సంస్థలు, వర్సిటీ సిబ్బందికీ డీఏ వర్తిస్తుందని ఆర్ధికశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.
Read Also: