NTV Telugu Site icon

Driver House: డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఇంటికి తాళం

Kkd Drover

Kkd Drover

కాకినాడలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో ఉత్కంఠ కొనసాగుతూనే వుంది. పోస్ట్ మార్టం నిర్వహించాలంటే కుటుంబ సభ్యుల సంతకాలు కావాలి. అయితే, కుటుంబసభ్యులు మాత్రం ఎమ్మెల్సీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసుల నుంచి స్పందన రాకపోవడం, కాకినాడ జీజీహెచ్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటుచేయడంతో ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు.

సుబ్రహ్మణ్యం శవపంచనామాకు సంతకాలు పెట్టడానికి కుటుంబ సభ్యులు ఆచూకీ లేకుండా పోయారు. మాకు న్యాయం చేసే వరకు సంతకాలు పెట్టమని అంటున్నారు కుటుంబ సభ్యులు. కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు. వారి బంధువుల్ని వాకబు చేస్తున్నారు పోలీసులు. పోస్ట్ మార్డం నిర్వహించాలంటే కుటుంబ సభ్యులు అనుమతి తప్పనిసరి. వారి సంతకాలు లేనిదే పోస్ట్ మార్డం నిర్వహించలేమని చెబుతున్నారు డాక్టర్లు. దీంతో గంటల తరబడి సుబ్రహ్మణ్యం డెడ్ బాడీ ఆస్పత్రిలోనే వుండిపోయింది.

పోస్ట్ మార్డం కేసుల్లో కేసు పెట్టిన పరిధి పోలీస్ స్టేషన్ సీఐ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ (IO)గా వుంటారు. IO ఇక్కడ ఉండే తీవ్రత ను కలెక్టర్, ఎస్పీ దృష్టికి తీసుకుని వెళ్తారు. వారి ఆదేశాల మేరకు కుటుంబ సభ్యులు రాకపోయినా పోస్ట్ మార్టం నిర్వహించవచ్చని చెబుతున్నారు పోలీసులు. ఏది ఏమైనా ఈ వ్యవహారం ఉత్కంఠను రేపుతుంది. టీడీపీ నిజనిర్దారణ కమిటీ రానుండడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.

LIVE: కారులో మృతదేహం… కారు వదిలిపోయిన YCP MLC ఎక్కడ?