న్యూజిలాండ్ యూత్ పార్లమెంట్ సభ్యురాలిగా తెలుగమ్మాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారు సత్తాచాటుతూనే ఉన్నారు. ఇప్పటికే తెలుగువారు ప్రపంచంలోని పలు దేశాల్లో తమదైన ముద్ర వేసి కీలక పదవులు దక్కించుకుంటున్నారు. తాజాగా ఓ తెలుగమ్మాయి అరుదైన గౌరవం దక్కించుకుంది. న్యూజిలాండ్ యూత్ పార్లమెంట్ సభ్యురాలిగా తెలుగుమ్మాయి మేఘన ఎంపికైంది. యువతరం ప్రతినిధిగా టీనేజి వయసులోనే ఆమె చట్టసభలోకి ప్రవేశించింది. 18 ఏళ్ల మేఘన వాల్కటో ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తోంది.
Read Also: వైరల్… ‘పుష్ప’ను వాడేసుకున్న అమూల్
Also Read
- Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
- OTR: పశ్చిమ గోదావరి వైసీపీలో నిస్తేజం.. పదవులు అనుభవిస్తున్నా గళం వినిపించని లీడర్లు!
- Daggubati Purandeswari: 2024 ఫార్ములానే స్థానిక ఎన్నికల్లోనూ.. పురందరేశ్వరి కీలక వ్యాఖ్యలు
- Konaseema Fishermen: 23 రోజుల తర్వాత శుభవార్త.. గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు క్షేమం
మేఘన తల్లిదండ్రులు న్యూజిలాండ్‌లో స్థిరపడ్డారు. ఆమె తండ్రి గడ్డం రవికుమార్ ఏపీలోని ప్రకాశం జిల్లా టంగుటూరు వాసి. ఆయన 2001లోనే న్యూజిలాండ్ వెళ్లారు. దీంతో అక్కడే పుట్టి పెరిగిన మేఘన… కేంబ్రిడ్జిలోని సెయింట్ పీటర్స్ హై స్కూలులో విద్యను అభ్యసించింది. విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే మేఘన అనేక సామాజిక సేవా కార్యక్రమాలతో అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా శరణార్థులకు చేయూతనివ్వడంలో ఎంతో కృషి చేస్తోంది. ఈ అంశంలో ఆమె కనబర్చుతున్న సేవా దృక్పథమే యూత్ పార్లమెంటు సభ్యత్వం లభించేందుకు కారణమైంది. మేఘన వచ్చే నెలలో ప్రమాణస్వీకారం చేయనుంది. కాగా పార్లమెంట్ సభ్యురాలిగా ఎంపికైన తెలుగమ్మాయి మేఘనకు పలువురు అభినందనలు తెలియచేస్తున్నారు.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..