జగదీష్‌రెడ్డి ఫైర్.. తండ్రిని మించిన దుర్మార్గుడు జగన్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడంలో మాటల యుద్ధం రోజురోజుకీ తారస్థాయికి చేరుతోంది… ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు తెలంగాణ విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి… ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీ సీఎం లేఖ రాయడంపై మండిపడ్డ ఆయన.. తండ్రిని మించిన దుర్మార్గుడు వైఎస్ జగన్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. సమస్యను సృష్టించిందే ఆంధ్ర సర్కార్ అని విమర్శించిన ఆయన.. హైదరాబాద్ నీటి అవసరాలు పట్టవా? కోర్టుకిచ్చిన మాటను తప్పిందేవరు.? సర్వేల పేరిట నిర్మాణాలు కొనసాగిస్తోంది నిజం కాదా..? జీవోల పేరిట చిలకపలుకులు పలుకుతున్నారు.. తెలంగాణ అవసరాల కోసం ఒక్క జీవోను ఇచ్చారా..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
మద్రాస్‌కు మంచినీటి పేరుతో వైఎస్ రాజశేఖరరెడ్డి.. కృష్ణా నీళ్లను దోచుకున్నారు.. సాగర్ ఎడమ కాలువ కింద రైతాంగానికి 50 ఏండ్లు ద్రోహమే చేశారని మండిపడ్డారు జగదీష్‌రెడ్డి.. ఏడేళ్లు కరువులోనూ కృష్ణా డెల్టాకు నీళ్లు వదిలారు.. ఎడమ కాలువ ఎట్టుమీద కుడికాలువ కింది భాగంలో ఉందని.. హుకుంలు జారీ చేయడం, దౌర్జన్యం, బెదిరింపులతో శ్రీశైలం, సాగర్ గేట్లు తెరిపించారని.. ఆడుకుంటాం.. వాడుకుంటాం అంటే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నంత కాలం తెలంగాణ హక్కుల్ని ఎవరూ హరించ లేరన్న జగదీష్ రెడ్డి.. చట్టపరంగా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.. శ్రీశైలం ప్రాజెక్టు కట్టిందే జలవిద్యుత్ ఉత్పత్తి కోసమని స్పష్టం చేశారు. రైతులు ఎక్కడైనా రైతులే.. ఇరు రాష్ట్రాలకు పనికి వచ్చే ఫార్ములాను ముందుకు తెచ్చిందే ముఖ్యమంత్రి కేసీఆర్ అని.. ఫార్ములాను పక్కన పెట్టి అహంకారంతో పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో తెలంగాణది ఏ మాత్రం తప్పులేదు.. తప్పు చేసినొళ్లే లేఖల పేరుతో పరిహాసం ఆడుతున్నారని ఫైర్ అయ్యారు మంత్రి జగదీష్ రెడ్డి.
Also Read
- OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
- OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
- Big Rain Alert: విజయవాడలో వర్ష బీభత్సం.. మునిగిపోయిన రోడ్లు, బ్రిడ్జిలు..
- Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
తాజావార్తలు
-
BRICS Summit 2026: BRICSకి 20 ఏళ్లు.. ప్రత్యేక స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన భారత్.. వీటి ప్రత్యేకత ఇదే
-
Samantha: బేబీ బంప్‌తో సమంత కొత్త ఫోటోలు.. ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతున్న సామ్!
-
Vivo X Fold 6: వివో X Fold 6 త్వరలో మార్కెట్లోకి.. Geekbenchలో లిస్టింగ్.. 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీ
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Idol Cleaning Tips : గణేష్ చతుర్థికి ఇంట్లోనే విగ్రహాలకు ఇలా కొత్త మెరుపు
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!