కేంద్రం నుంచి రావల్సినవి తెచ్చుకోవడం మా హక్కు అని కేసీఆర్ అన్నారని, నిధులు రాబట్టే విషయంలో మిగిలిన వారు కూడా అలాగే వ్యవహరిస్తారని మేము బిచ్చమెత్తుకుంటే మీకెంటని తెలంగాణ టీఆర్ ఎస్ నేతలకు సజ్జల రామకృష్ణా రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ నేతలు ఈ విధంగా మాట్లాడటం వారి రాజకీయ అజ్ఞానమే అవుతుం దన్నారు. కేంద్రం నుంచి నిధులను రావాల్సిన పద్ధతుల్లో రాబట్టు కుంటున్నామన్నారు. వారు ఎలా పోవాలో వారు చూసుకోవాలి, మేము ఎలా పోతే వారికేమిటీ అని ఆయన ప్రశ్నించారు. వారి సమస్యల నుంచి తప్పించుకునేందుకే ఇలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశా రు. వారి సమస్యల నుంచి ప్రజలను దృష్టి మళ్లించేందుకే తెలం గాణ నేతలు ఇలా ఎపీ గురించి మాట్లాడుతున్నారన్నారు. టీఆర్ఎస్ కు ఏపీలో ప్రజెన్స్ లేదన్నారు.ఇక్కడ ప్రజెన్స్ లేని పార్టీ ఇక్కడి వాటి గురించి ఇక్కడి వాటి గురించి కామెంట్ చేయడం సరైంది కాదన్నారు.
అన్ని రిసోర్సులు హైదరాబాద్‌లోనే ఉన్నాయని రాష్ట్రాన్ని విడదీసీ అన్యాయం చేశారని మేం ఎప్పుడైనా అన్నామ అన్నారు. అనంతరం టీడీపీ నేతలపై ఆయన ఫైర్ అయ్యారు. విద్యుత్ రంగంలో మా హయాంలో ఎంత అప్పు ఉందో…మా హయాంలో అప్పులు ఎన్ని ఉన్నాయో పయ్యావుల చెప్పాలన్నారు. తక్కువ ధరకు విద్యుత్ కొనుగోళ్లు చేస్తూ అధిక భారాన్ని తగ్గించుకుంటున్నామన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడమనేది రాజకీయ విధానాలకు సంబంధించిన విషయం అన్నారు. మీటర్లకు రైతులకు సబ్సీడీకి సంబంధం లేదన్నారు. మీటర్లు పెట్టాలన్న కేంద్రం రాష్ట్రాలకు చెప్పింది.దాన్ని మేము ఫాలో అయితే తప్పేముందన్నారు. మీటర్ల బిగింపు వల్ల రైతులకు దీనివల్ల నష్టం జరగదని పేర్కొన్నారు. దేని కెంత విద్యుత్ ఇస్తున్నామో తెలిసేందుకే మీటర్ల బిగిస్తున్నామని ఆయన తెలిపారు.
ఇక్కడ తెదేపా ఎలా మాట్లాడుతుందో అక్కడ టీఆర్‌ఎస్ కూడా అలాగే మాట్లాడుతుందన్నారు. ఈసందర్భంగా విభజన చట్టంలోని అంశా లపై ఆయన మాట్లాడారు.స్పెషల్ స్టేటస్ ,విభజన చట్టం లోని అంశాలు సదరన్ జోన్ సమావేశంలో ప్రస్తావిస్తామని సజ్జల తెలిపారు. సదరన్ జోన్ సమావేశానికి సీఎం జగన్ తప్పక పాల్గొంటారన్నారు. మూడు రాజధానుల అంశాలకు నిధులివ్వాలని కూడా సమావేశంలో కేంద్రాన్ని కోరతామన్నారు. టీడీపీ దిగిపోయే నాటికి విద్యుత్ రంగంలో 70 వేల కోట్లు పైనే అప్పులు పెట్టి పోయిందన్నారు. 2.49 పైసలకు సెకీ ద్వారా సోలార్ విద్యుత్‌ను తీసుకొస్తున్నామన్నారు. వచ్చే 25 ఏళ్లపాటు ఉచిత విద్యుత్ ను రైతుల హక్కుగా ఉంచేలా చర్యలు తీసుకుంటున్నామని సజ్జల తెలిపారు.
