నందమూరి బాలకృష్ణ అభిమానులకు సంక్రాంతి పండుగ ముందే తెచ్చారు. నటసింహం బాలయ్య నటించిన వీరసింహారెడ్డి మూవీ ఇవాళ విడుదలైంది. ఏపీలోని నంద్యాలలోని మిని ప్రతాప్ థియేటర్ లో వీరసింహారెడ్డి సినిమా కాసేపు నిలిచిపోయింది. తెల్లారి జామున 5 గంటలకే ప్రారంభమైంది సినిమా షో. వివిధ కారణాల వల్ల రెండు సార్లు 45 నిమిషాల పాటు సినిమా నిలిచిపోయింది. దీంతో బాలయ్య అభిమానుల్లో టెన్షన్ టెన్షన్ నెలకొంది. తర్వాత సినిమా యధావిధిగా కొనసాగింది. సాంకేతిక లోపాలే కారణమంటున్నారు థియేటర్ సిబ్బంది.
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో.. గోపీ చంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన వీరసింహారెడ్డి చిత్రం సంక్రాంతి కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలయ్య మూవీ అంటే యాక్షన్ మామూలుగా ఉండదు. ప్రి పండుగకు బాలయ్య మూవీ విడుదల కావడం రివాజు. 2021 డిసెంబర్ లో ‘అఖండ’తో తెలుగు సినిమాకు మళ్ళీ ఓ వెలుగు తీసుకు వచ్చారు. ఆ తరువాత బాలకృష్ణ నటించిన ఏ చిత్రమూ 2022లో ఏ మూవీ విడుదల కాలేదు.
దాంతో బాలయ్య అభిమానులు ఆయన సినిమా కోసం అమితాసక్తితో ఎదురుచూస్తున్న సమయంలోనే 2023లో సంక్రాంతి కానుకగా ‘వీరసింహారెడ్డి’ చిత్రం జనం ముందు నిలచింది. గురువారం విడుదలయిన ‘వీరసింహారెడ్డి’లో బాలకృష్ణకు బాగా అచ్చివచ్చిన ఫ్యాక్షన్ డ్రామా, ఫ్యామిలీ సెంటిమెంట్ కలగలసి ఉండడం విశేషం! పైగా బాలకృష్ణ సినిమా టైటిల్స్ లో ‘సింహా’ అన్న పదం చోటు చేసుకుంటే సూపర్ హిట్ ఖాయం అనే నమ్మకం ఉండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా ప్రదర్శన ఆలస్యం అయితే వారిలో టెన్షన్ నెలకొంటుంది. నంద్యాలలో అదే జరిగింది. మున్ముందు ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు లేకుండా చూడాలని బాలయ్య అభిమానులు కోరుతున్నారు.
Read Also: Veera Simha Reddy Movie Review: వీరసింహారెడ్డి