కాకినాడ జిల్లాలో వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ బాబు కారులో అనుమానాస్పద స్థితిలో డ్రైవర్ డెడ్ బాడీ లభించడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించారు నారా లోకేష్. డ్రైవర్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని లోకేష్ హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ అనంత బాబే హత్య చేశాడని జరిగిన ఘటన గురించి లోకేషుకి వివరించారు సుబ్రహ్మణ్యం తల్లి, భార్య.
మృతదేహాన్ని తరలించకుండా అడ్డుకున్న మాపై పోలీసులు దాడి చేశారని లోకేషుకు వివరించారు సుబ్రహ్మణ్యం భార్య. జరిగింది ఒక్కటైతే పోలీసులు కేసును తప్పుదోవ పట్టించే విధంగా ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారన్న సుబ్రమణ్యం కుటుంబ సభ్యులు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువకుడ్ని అన్యాయంగా చంపేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు నారా లోకేష్. ఎమ్మెల్సీ అనంత బాబుని తక్షణమే అరెస్టు చేయాలి. జరిగింది ఒకటైతే కట్టు కథ అల్లి కేసును తప్పుదోవ పట్టిస్తూ, వైసీపీ ప్రజాప్రతినిధిని కాపాడే విధంగా పోలీసులు వ్యవహరించడం దారుణం.
కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకునే విధంగా ఒత్తిడి తీసుకొస్తాం. మాకు న్యాయం జరిగే వరకూ పోరాడతామని లోకేష్ తో సుబ్రహ్మణ్యం భార్య పేర్కొన్నారు. గత ఐదు ఏళ్లుగా అనంత బాబు దగ్గర డ్రైవర్ గా చేస్తున్నాడు సుబ్రహ్మణ్యం. నాలుగు నెలల క్రితం ఇద్దరి మధ్య గొడవలు తో సుబ్రహ్మణ్యం డ్రైవర్ జాబ్ మానేశాడన్నారు. అప్పటి నుంచి ఎమ్మెల్సీ పర్సనల్ విషయాలు డబ్బులు ఇవ్వకపోతే బయటకు చెప్పేస్తానని తరచు చెప్తున్నాడు సుబ్రహ్మణ్యం. ఈ వ్యవహారమే ఘటనకు కారణంగా భావిస్తున్నారు. మరోవైపు జిల్లా పరిషత్ దగ్గర దళిత సంఘాలు ఆందోళన, రాస్తారోకో చేస్తున్నాయి. జెడ్పీ సమావేశం జరుగుతుండగా నిరసన తెలుపుతున్నారు. ఆందోళనకారులను అడ్డుకుంటున్నారు పోలీసులు.
మాజీ హోంమంత్రి చిన రాజప్ప మాట్లాడుతూ.. రాష్ట్రంలో పోలీసుల ఓవర్ యాక్షన్ ఎక్కువ అయిపోయింది. బాధితులను నిందితులు బెదిరిస్తున్నారు. ఎమ్మెల్సీ ని వెంటనే అరెస్ట్ చేయాలి. బాధితులకు టీ డీ పీ అండగా ఉంటుందని, వారి తరుపున పోరాటం చేస్తామన్నారు చినరాజప్ప.
LIVE: వైసీపీ ఎమ్మెల్సీ కారులో మృతదేహం.. అసలేం జరిగింది?