ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విషయం ఇప్పుడు మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది.. విభజన సమస్యల పరిష్కారం కోసం జరిగే సమావేశం అజెండాలో మొదట స్పెషల్ స్టేటస్‌ను చేర్చిన కేంద్ర హోంశాఖ.. ఆ తర్వాత మళ్లీ తొలగించడంపై ఏపీ గుర్రుగా ఉంది.. ఈ వ్యవహారంలో బీజేపీతో పాటు ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీని టార్గెట్ చేస్తోంది తెలుగు దేశం పార్టీ.. ఈ వ్యవహారంపై శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు.. రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ హామీతో వైసీపీ అధికారంలోకి వచ్చింది.. ఇప్పుడు చిత్తశుద్ధి ఉంటే ఆ పార్టీకి చెందిన చెందిన 28 మంది ఎంపీలు రాజీనామా చేసి ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు.. ఆ మరుసటి క్షణమే మేం కూడా పదవులకు రాజీనామా చేస్తామని ప్రకటించారు రామ్మోహన్‌నాయుడు..
Read Also: Whatsapp: వాట్సాప్‌లో మరో ఫీచర్…ఫేస్‌బుక్ తరహాలో…
సబ్ కమిటీలో స్పెషల్ స్టేటస్ అంశాన్ని అజెండాలో పెడితే డప్పు కొట్టి చెప్పారు… ఐదు అంశాలను తొలగిస్తే కేంద్రాన్ని ప్రశ్నించరా..? అని వైసీపీని నిలదీశారు రామ్మోహన్ నాయుడు.. సీఎం వైఎస్ జగన్ వైఫల్యం, చేతగాని తనమే ప్రత్యేక హోదా అంశాన్ని అజెండా నుంచి వెనుక్కు తీసుకున్నారని విమర్శించిన ఆయన… తమిళనాడు సీఎం స్టాలిన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తెలంగాణ సీఎం కేసీఆర్.. కేంద్రానికి భయపడటంలేదు… కానీ, ఏపీ సీఎం జగన్ కేంద్రాన్ని గొంతెత్తి ఎందుకు అడగటం లేదు అని నిలదీశారు.. 151 మంది మినహా వైఎస్ జగన్‌ను ఎవరూ పొగిడే పరిస్థితి లేదన్న ఆయన.. సినిమా వాళ్లను పిలిపించుకొని పొగిడించుకుంటున్నారని ఎద్దేవా చేశారు.. తుగ్లక్ లానే కాకుండా పులకేసిలా జగన్ పొగిడించుకుంటున్నారని సెటైర్లు వేశారు.. ఇక, రామానాయుడు స్టూడియోనే ఇబ్బంది పెట్టారని ఆరోపించారు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు.