ఏపీ కౌన్సిల్ జరుగుతున్న తీరుపై విపక్ష టీడీపీ ఎమ్మెల్సీలు మండిపడ్డారు. కల్తీసారా వాస్తవాలు బయటకొస్తాయని ప్రభుత్వం భయపడుతోంది.రాష్ట్రంలో లభ్యమయ్యే మద్యంతో రసాయనాలు ఉన్నాయనే ల్యాబ్ రిపోర్టులు మా దగ్గర ఉన్నాయి. కొన్ని రసాయనాలు సైనేడ్ గా మారొచ్చనే అధ్యయనాలు ఉన్నాయి. ఇవన్నీ బయటకొస్తాయనే మమ్మల్ని దూషించి చర్చ నుంచి పారిపోతున్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చించమంటే స్పీకర్ మార్షల్స్ ని రమ్మంటున్నారు. మంత్రులు బొత్స, కొడాలినాని తరహాలో మా సభ్యులు ఎవ్వరూ ప్రవర్తించట్లేదు. కౌన్సిల్ ఛైర్మన్ గా ఉన్న షరీఫ్ ను బొత్స కులం పేరుతో దూషిస్తే, కొడాలినాని ఛైర్మన్ టేబుల్ ఎక్కలేదా..? అని ప్రశ్నించారు ఎమ్మెల్సీ నారా లోకేష్.
శాసన మండలిలో కోరం లేకపోవడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు ఎమ్మెల్సీ ఫరూఖ్. ఛైర్మన్ వచ్చి మంత్రులు, సభ్యుల కోసం వేచి చూసే కొత్త సంప్రదాయం చూస్తున్నాం. ఇవాళ్టి పరిణామాలకు చింతిస్తున్నాం, ముఖ్యమంత్రి, ప్రభుత్వం సభకు క్షమాపణ చెప్పాలి.
ఓ ప్రజాసమస్యపై చర్చ కోసం ఏనాడూ ప్రతిపక్షం ఇన్ని రోజులు వేచి చూడలేదు. కమీషన్ కోసమే జే బ్రాండ్ మద్యాన్ని రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం అంటే మద్యం ఆదాయం రూ.16వేల కోట్లకు పెంచుకోవటమా..? మద్యం భవిష్యత్తు ఆదాయంపై అప్పు తెచ్చిన వారు మద్య నిషేధం ఎలా అమలు చేస్తారు..? అని ప్రశ్నించారు చిక్కాల రామచంద్రరావు. సీఎం నియోజకవర్గం పులివెందులలో నాటు సారా కాస్తున్నారు. ఇక జంగారెడ్డి గూడెంలో సారా కాయరు అని సీఎం ఎలా చెప్తారు..? సారాపై చర్చకు ప్రభుత్వం భయపడుతుంది.
సభ చర్చకు అనుమతిస్తే సీఎంకు ఎంత ఆదాయం నెలకు వస్తుంది మద్యంపై అనేది నిరూపిస్తాం. బాబాయ్ హత్యను కూడా సహజ మరణమన్న వైసీపీకి.. జంగారెడ్డి గూడెం మరణాలు కూడా సహజ మరణాలుగానే చెబుతున్నారు అన్నారు ఎమ్మెల్సీ బీటెక్ రవి. డిప్యూటీ సీఎం వారాయణ స్వామిపై మండలి ఛైర్మనుకు ప్రివిలేజ్ నోటీసిచ్చిన టీడీపీ ఎమ్మెల్సీలు. మండలి నియావళి రూల్ 173 ప్రకారం ఛైర్మనుకు నోటీసులు ఇచ్చారు. నారా లోకేష్‌ని అసెంబ్లీలో నారాయణ స్వామి దూషించారంటూ టీడీపీ ఎమ్మెల్సీల అభ్యంతరం తెలిపారు. రూల్ 291(ii) నిబంధన పాటించలేదన్నారు టీడీపీ ఎమ్మెల్సీలు.