NTV Telugu Site icon

Social Media Fake Posts: టీడీపీపై తప్పుడు ప్రచారం..! విజయసాయిరెడ్డిపై సీఐడీకి టీడీపీ ఫిర్యాదు..

Varla Ramaiah

Varla Ramaiah

టీడీపీ నేతలపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఎంపీ విజయ సాయిరెడ్డి, గుర్రంపాటి దేవేంధర్ రెడ్డిలపై సీఐడీ ఏడీజీకి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు.. ఈ మేరకు లేఖ రాసిన ఆయన.. లేఖలో.. టీడీపీ నేతలపై వైసీపీ నాయకులు సామాజిక మాధ్యమాల్లో నిస్సిగ్గుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.. ఏపీ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ హోదాలో ఉన్న గుర్రంపాటి దేవేంద్ర రెడ్డి నారా లోకేష్‌పై తప్పుడు ప్రచారం చేశారు. రెండు రాజకీయ పార్టీల మధ్య శత్రుత్వం, ద్వేషం పెంచడమే దేవేంద్ర రెడ్డి ఉద్దేశంలా కనిపిస్తుందని.. సామాజిక మాధ్యమాల్లో దేవేందర్‌రెడ్డి ప్రచారం చేసినట్లుగా జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో 273, 274, 275, 276 సర్వే నంబర్లే లేవు.. వైసీపీ నాయకులు ప్లాట్ నెం. 3, రోడ్ నంబర్. 12, బంజారాహిల్స్, ఎమ్మెల్యే కాలనీ, హైదరాబాద్ నుంచి నిరాధారమైన ఆరోపణలతో తప్పుడు ప్రచారం చేశారని పేర్కొన్నారు.

Read Also: MP Gorantla Madhav Issue: ఎంపీ గోరంట్ల మాధవ్‌ వీడియోపై విచారణ.. కఠిన చర్యలు తప్పవు..!

ఇక, 3 ఆగస్టు 2022న ఏ2 విజయ సాయి రెడ్డి సైతం టీడీపీ నాయకుల హత్యారాజకీయాల పేరుతో తప్పుడు ప్రచారం చేశారని లేఖలో పేర్కొన్నారు వర్ల రామయ్య.. 3 ఆగస్టు 2022న టీడీపీ నాయకులు నక్కా ఆనంద్ బాబు, ఆలపాటి రాజా, అశోక్ బాబు దీనిపై పిర్యాదు చేసేందుకు మంగళగిరి రూరల్ సీఐ భూషణంని సంప్రదించిగా ఆయన బాధ్యతారాహత్యంగా ప్రవర్తించారని తెలిపారు.. సీఐ తన ప్రాథమిక బాధ్యతలను విస్మరించి మా నాయకులపై అసభ్యకరంగా దుర్భాషలాడారని పేర్కొన్నారు. మీడియాతో కూడా మాట్లానివ్వకుండా వారిని బలవంతంగా అక్కడ నుంచి ఖాళీ చేయించారని.. ఇప్పటి వరకు మా ఫిర్యాదుపై ఎటువంటి కేసు నమోదు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతల ఆదేశాలతో నిందితులపై చర్యలు తీసుకునేందుకు స్థానిక పోలీసులు ఆసక్తి చూపడం లేదన్న ఆయన.. అధికార పార్టీ నేతలపై అనేకసార్లు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్న దేవేంద్ర రెడ్డి, విజయసాయి రెడ్డిలపై కఠిన చర్యలు తీసుకోవాలని.. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాధితులపై అసభ్యంగా ప్రవర్తించినందుకు సీఐ భూషణంపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని లేఖలో సీఐడీ ఏడీజీకి విజ్ఞప్తి చేశారు వర్ల రామయ్య.