Site icon NTV Telugu

Vangalapudi Anitha: అనుకున్నట్లే జరిగింది.. డర్టీ ఎంపీకి సచ్చీలుడు సర్టిఫికెట్

Vangalapudi Anitha

Vangalapudi Anitha

Vangalapudi Anitha: ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో రిపోర్టుపై టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత తనదైన శైలిలో సెటైర్లు వేశారు. అనుకున్నట్లే జరిగిందని.. తప్పును కప్పిపుచ్చడానికి చేయాల్సినవన్నీ చేస్తున్నారని వంగలపూడి అనిత ఆరోపించారు. డర్టీ ఎంపీ మాధవ్‌కు సచ్చీలుడు అన్న సర్టిఫికెట్ ఇస్తున్నారని మండిపడ్డారు. దీన్ని సమర్థిస్తున్నారా లేదా అనేది సీఎంగా, ఆ పార్టీ అధ్యక్షుడిగా జగన్ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఎంపీ మాధవ్‌పై చర్యలు తీసుకోకపోతే వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర మహిళల దెబ్బ వైసీపీకి గట్టిగా తగులుతుందని వంగలపూడి అనిత హెచ్చరించారు.

మరోవైపు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ కూడా ఈ అంశంపై స్పందించారు. ఎంపీ న్యూడ్ వీడియోకు సంబంధించి ప్రభుత్వానికి ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిందని.. ఆ రిపోర్టు ఎంపీ మాధవ్‌కు వ్యతిరేకంగా వచ్చిందని.. కాబట్టే అనంతపురం ఎస్పీతో మాట్లాడించారని ఆరోపించారు. తాడేపల్లి నుంచి వెళ్లిన స్క్రిప్టును అనంతపురం ఎస్పీతో చెప్పించారని విమర్శలు చేశారు. న్యూడ్ వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామని.. రిపోర్టులో ఒరిజనల్ అని తేలితే చర్యలు ఉంటాయని గతంలో వైసీపీ వాళ్లే చెప్పారని.. ఇప్పుడు ల్యాబ్‌కు అసలు వీడియోనే పంపలేదని ఎస్పీ మాట మార్చారని బోండా ఉమ అన్నారు. హోంమంత్రి మాట ఏమైంది..? సకల శాఖ మంత్రి మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. అసలు ఏ టెక్నికల్ గ్రౌండ్స్ మీద అనంతపురం ఎస్పీ మాట్లాడారని నిలదీశారు. తానే ఫిర్యాదు చేశానని గోరంట్ల మాధవ్ చెప్పారని.. కానీ ఎస్పీ మాత్రం తనకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని చెప్తున్నారని బోండా ఉమ పేర్కొన్నారు. ఎంపీ మాధవ్ వీడియో మార్ఫింగ్ అయ్యిండొచ్చు.. ఎడిటింగ్ అయ్యిండొచ్చు అని భావిస్తున్నామని ఎస్పీ ఎలా చెబుతారని ప్రశ్నించారు. వీడియో ఎనాలసిస్ చేస్తే.. ఆ వీడియో పుట్టు పూర్వత్తరాలు తీయవచ్చని.. వైసీపీ ప్రజల్లో పతనమవుతోందని.. అందుకే ఎస్పీతో ప్రెస్ మీట్ పెట్టించారన్నారు.

Read Also: Gorantla Madhav: వీడియోను సృష్టించిన వారిపై పరువునష్టం దావా వేస్తా.. వాడొక అరగుండు వెధవ

అసలు వీడియోలో ఎంపీనో కాదో అనే విషయాన్ని గుర్తు పట్టలేకపోతున్నామని ఎస్పీ చెప్పడం ఆశ్చర్యంగా ఉందని బోండా ఉమ అన్నారు. ఒరిజినల్ వీడియోకు ఒకరు వేరేవారికి పంపితే.. వాళ్లు వీడియో చూస్తుంటే దాన్ని మూడో వ్యక్తి రికార్డ్ చేశారంటున్నారని.. ఇంతకీ ఎవరా ముగ్గురు అని బోండా ఉమ సూటిగా ప్రశ్నించారు. ఎవ్వరి ఫోన్లల్లోనూ ఒరిజినల్ వీడియోలు ఉండవు అని.. అయినా విచారణ చేపట్టడం లేదా అని నిలదీశారు. గోరంట్ల మాధవ్ ఫోన్ ఎందుకు సీజ్ చేయలేదని.. మాధవ్‌ను రక్షించేందుకే పోలీసులు విచారణ చేపట్టారన్నారు. ఇది వీడియో కాలా..? రికార్డెడ్ వీడియోనా..? అనేది కూడా తేలాలన్నారు. మాధవ్ ఎపిసోడు నుంచి దృష్టి మళ్లించేందుకు రోజా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని.. చింతమనేని గురించి ఇప్పుడెందుకు ప్రస్తావన అని.. మోకాలికి బోడిగుండుకు ముడి వేయడం దేనికి అని బోండా ఉమా ప్రశ్నించారు.

Exit mobile version