దేశమంతా డిజిటల్ విప్లవం నడుస్తోంది జేబులో పర్సు లేకపోయినా.. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా.. డెబిట్, క్రెడిట్ కార్డులు, సెల్‌ఫోన్ అందుబాటులో ఉంటే పని సులువవుతోంది. పాల ప్యాకెట్ తీసుకోవచ్చు.. హోటల్‌లో తినొచ్చు.. వేడివేడి టీ తాగొచ్చు.. బార్బర్ షాపులోనూ నచ్చినట్లు కటింగ్ చేయించుకోవచ్చు.. వైన్ షాపులో మనకు నచ్చిన మందు కొనుగోలు చేయవచ్చు. మార్కెట్‌లో కూరగాయలు మొదలుకొని దుకాణంలో సరుకుల కొనుగోలు వరకు కార్డు ఉంటే చాలు ఎలాగైనా పనులు చేసుకోవచ్చు. పాతకాలం పోయింది.. కొత్త కాలం వచ్చింది.. ప్రపంచం డిజిటల్ మయంగా మారింది. ఎక్కడ చూసినా ఆన్‌లైన్ చెల్లింపులకు తెర తీస్తున్నారు. ఆన్ లైన్ చెల్లింపులు అన్నిచోట్ల అమలవుతుంటే మాత్రం…ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ముందున్న ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అమలు కావడం లేదు.
Read Also: Khammam market: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఉద్రిక్తత.. మిర్చి అమ్మకానికి అడ్డుకోవడంతో దాడి
ప్రపంచమంతా డిజిటల్, యూపీఐ పేమెంట్స్ అంటుంటే… ఏపీలో మాత్రం అలాంటిదేం కనిపించడం లేదు. తాజాగా టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. మోడీ గారు.. భారత్ లోని డిజిటల్ విప్లవం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచినా మా ఏపీలో మాత్రం చెల్లదు.మా జగనన్న బ్రాందీ షాపుల్లో డిజిటల్ చెల్లింపులు అస్సలు కుదరవ్. అంతా క్యాష్ కట్టాల్సిందే.. సాయంత్రానికి కంటైనర్లలో నోట్ల కట్టలు తోలాల్సిందే. అది మందైనా… ఇసకైనా.. లేక సిలికా అయినా, ఇంకేదైనా సరే నోట్లు చూడందే మాకు నిద్ర పట్టదన్నారు సోమిరెడ్డి. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
Read Also: Florida Student: టీచర్ని ఎముకలు విరిగేలా కొట్టిన స్టూడెంట్
