Somireddy Chandramohan Reddy: పోలీసుల ఓవరాక్షన్ ఎక్కువైంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నెల్లూరు జిల్లాలో టీడీపీ వర్సెస్ వైసీపీ రాజకీయంగా రంజుగా వుంటుంది. మాజీ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం, పోలీసుల తీరుపై మండిపడ్డారు. దళితుడు ఉదయగిరి నారాయణ మృతిపై టీడీపీ పోరాటం ఫలించింది. నెల్లూరు జిల్లాలో పోలీసుల ఓవరాక్షన్ ఎక్కువయింది. జిల్లా ఎస్పీ కూడా అధికార పార్టీకి వెన్నుదన్నుగా ఉంటున్నారు. పోలీసులు కొట్టి చంపారని పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ వచ్చినా దాన్నితారుమారు చేశారు.
ఈ విషయాన్ని వైద్యులే నాకు చెప్పారు. నెల్లూరు జిల్లాలో శాంతిభద్రతలు అదుపు తప్పాయన్నారు సోమిరెడ్డి. రూ. 5 లక్షలు అకౌంట్ లో వేసి కేసు మాఫీ కోసం ప్రభుత్వం ఆటలు ఆడింది. 5వేలు పింఛన్..4వతరగతి ఉద్యోగం,18 అంకణాలు స్థలం, 3ఎకరాలు పొలం ఇస్తా అని ప్రభుత్వం హామీ ఇచ్చింది. మంత్రి ప్రోద్బలంతోనే అధికారులను 4 నెలలకే బదిలీలు చేస్తున్నారు. ముత్తుకూరు ఎస్.ఐ బహిరంగంగా సెటిల్మెంట్లు చేస్తున్నారు. ప్రభుత్వం.అధికారుల తీరుపై జనసేన, బీజేపీ, సీపీఎం, సీపీఐలతో కలిసి పోరాటం చేస్తాం అన్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.
Also Read
- AP Weather Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. పల్నాడు సహా 7 జిల్లాలకు అలర్ట్
- Vizag Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్..
- Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురు కార్మికుల సజీవ దహనం
- CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
ఇదిలా వుంటే.. ఉదయగిరి నారాయణ మృతిపై జాతీయ ఎస్సీ కమిషన్ విచారణ చేపట్టింది. పొదలకూరు ఎస్సై కరిముల్లా కొట్టడంతోనే జూన్ 19న నారాయణ చనిపోయాడని, తమకు న్యాయం చేయాలని నారాయణ భార్య పద్మ కమిషన్‌ను ఆశ్రయించారు. దీంతో ఎస్సీ కమిషన్ డైరెక్టర్ డాక్టర్ జి.సునీల్‌కుమార్‌బాబు శనివారం జిల్లాలో విచారణ చేపట్టారు. తొలుత మృతదేహం లభ్యమైన ప్రాంతాన్ని పరిశీలించి తర్వాత కందమూరు వెళ్లారు. మృతుడి భార్య పద్మతో మాట్లాడి పలు వివరాలు తెలుసుకున్నారు. ఈ సమయంలో పెద్ద కుమారుడు సైతం తన తండ్రిని పోలీసులు కొట్టడంతోనే చనిపోయాడని తెలిపాడు. ఈ వ్యవహారం పెను సంచలనం కలిగించనుంది.
తాజావార్తలు
-
KING 100 : దూసుకొస్తున్న కింగ్ 100.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Vaibhav Sooryavanshi: అందరి చూపు వైభవ్ సూర్యవంశీపైనే.. మరో విధ్వంసానికి సిద్ధమైన వండర్ కిడ్!
-
Peddi Collections : 300 కోట్లకు చేరువలో… వర్కింగ్ డేలో ‘పెద్ది’ కలెక్షన్ల ఊచకోత
-
NANI : ప్యారడైజ్ ఆగస్టు రిలీజ్ పోస్ట్ పోన్.. న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడంటే
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!