Site icon NTV Telugu

Pattabhi Ram: ఈడీ నోటీసులతో మాకేం భయం లేదు

ఆర్థిక లావాదేవీలపై ఏ దర్యాప్తు సంస్థలు కేసులు నమోదు చేసినా.. ఈడీ దాని గురించి ఆరా తీస్తుందన్నారు టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరాం. .ఇందులో నిజానిజాలేంటని నిగ్గు తేల్చేందుకే ఈడీ నోటీసులిచ్చింది. స్కిల్‌ డెవలప్మెంట్‌ ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ సీఐడీ తప్పుడు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఈడీ నోటీసులతో మేమేం భయపడడం లేదన్నారు. నోటీసులు ఇచ్చిన వాళ్లు అక్కడికి వెళ్లి సమాధానం చెబుతారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం జరిగిందంటూ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన సీఐడీ ఏం పీకింది..?ఏడాది నుంచి సీఐడీ ఏం గడ్డిపీకలేకపోయింది.. ఈడీ నోటీసులకు మేం భయపడతామా..? అని ఆయన ప్రశ్నించారు.

Read Also: Jagapathi Babu: రమ్, విస్కీ, బ్రాందీ, చెత్త చెదారం అన్ని ఇదే నాకు

చంద్రబాబు మీద.. ఘంటా సుబ్బారావు మీద ఆధారాలేం నిరూపించగలిగారు..?ఈడీ తాటాకు చప్పుళ్లకు.. నోటీసులకు మేం కంగారుపడం.మేమేమన్నా విజయసాయిరెడ్డిలా చంద్రబాబు, లోకేష్‌లు తమ ఫోన్లు పోయాయని ఫిర్యాదులు చేస్తారా..? మాకా ఖర్మ పట్టలేదు.స్కిల్‌ డెవలప్మెంట్‌ ప్రాజెక్ట్‌ ద్వారా చాలా మందికి శిక్షణ ఇచ్చారు.స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్ల ద్వారా చాలా మందికి ఉపాధి లభించింది.నిరుపేదలకు ఉపాధి లభిస్తోంటే సీఎం జగన్‌కు నచ్చడం లేదు.2020 మార్చి నాటికి 2.12 లక్షల మంది స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లల్లో ట్రైనింగ్‌ ఇచ్చారన్నారు.

64 వేల మందికి ఉపాధి లభించిందన్నారు పట్టాభిరాం. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శిక్షణ కేంద్రాలు నెలకొల్పిన చాలా కాలేజీలు గుడ్‌ కండిషన్‌లో పరికరాలు అందాయని సర్టిఫై చేశారు.గుడ్‌ కండిషన్‌లో పరికరాలు తీసుకున్నామని 2021 ఆగస్టులో కాలేజీల నుంచి లేఖలు వస్తే.. డిసెంబర్‌ 2021లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తారా..?అలాగే సీమెన్స్‌ సప్లై చేసిన పరికరాలు సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫ్‌ టూల్‌ డిజైన్స్‌ సంస్థ సర్టిఫికెట్‌ ఇచ్చింది.ఒక్కొ క్లస్టర్‌కు రూ. 500 కోట్లకు పైగా ఖర్చు అవుతుందన్న అంచనాను ఇంటెలిజెన్స్‌ ఆఫ్‌ టూల్‌ డిజైన్స్‌ సంస్థ నిర్ధారించింది.ఈ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించిన ప్రేమ్‌ చంద్రారెడ్డి, రావత్‌, అజేయ్‌ జైన్‌ వంటి వారికి సీఐడీ ఎందుకు విచారించ లేదని పట్టాభి ప్రశ్నించారు.

Read Also: Kalva Srinivasulu:రాయలసీమకు తీరని అన్యాయం చేసింది జగనే

Exit mobile version