NTV Telugu Site icon

Gannavaram: గన్నవరం ఘర్షణ.. టీడీపీ నేతలపై హత్యాయత్నం, అట్రాసిటీ కేసులు..

Tdp

Tdp

Gannavaram: కృష్ణా జిల్లా గన్నవరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం విదితమే.. టీడీపీ, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వర్గీయుల మధ్య చెలరేగిన వివాదంలో.. టీడీపీ కార్యాలయం ధ్వంసం అయ్యింది.. పలు కార్లను కూడా ధ్వంసం చేశారు.. ఓ కారుకు నిప్పుపెట్టారు.. కార్యాలయంలో ఫర్నీచర్‌, అద్దాలు పగలగొట్టారు.. ఇక, ఈ దాడికి నిరసనగా టీడీపీ ఆందోళనకు దిగింది.. రోడ్డుపై బైఠాయించారు టీడీపీ నేతలు.. దీంతో మళ్లీ మళ్లీ టెన్షన్‌ వాతావరణం నెలకొంది.. టీడీపీ నేత పట్టాభి సహా పలువురు నేతలను అరెస్ట్‌ చేశారు పోలీసులు.. మరోవైపు.. గన్నవరం ఘటనలో 6 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు పోలీసులు.. గన్నవరం సీఐ కనకారావు ఇచ్చిన ఫిర్యాదుపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ సహా పలు సెక్షన్ ల కింద కేసులు నమోదు చేశారు.. రెండు కేసుల్లో హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం, 143, 147, 149, 307 , 333, 341, 353 ఐపీసీ సెక్షన్ ల కింద కేసులు పెట్టారు.

Read Also: KL Rahul: కేఎల్ రాహుల్‌కి మరో బిగ్ షాక్.. స్థానం పోయినట్టే?

గన్నవరంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదు చేశారు గన్నవరం సీఐ కనకారావు.. ఈ కేసులో ఏ1 గా పట్టాభి, ఏ2గా దొంతి చిన్నాతో పాటు మరో 15 మంది పై కేసులు నమోదు చేశారు.. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరుడు సీమయ్య అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.. ఇక, రమేష్ బాబు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరో కేసులో 143, 147, 149, 353 ఐపీసీ సెక్షన్ ల కింద కేసు పెట్టారు.. ఇక, అరెస్ట్‌ చేసిన టీడీపీ నేతలు, కార్యకర్తలను గన్నవరం కోర్టులో హాజరుపర్చారు పోలీసులు..

Read Also: Pak University Exam: యూనివర్సిటీ పరీక్షలో బూతు ప్రశ్న.. అన్నాచెల్లి మధ్య లింక్‌!

మరోవైపు.. గన్నవరం టీడీపీ కార్యాలయాన్ని ఏ విధంగా ధ్వంసం చేశారనే అంశంపై సీసీ ఫుటేజ్ విడుదల చేసింది టీడీపీ.. పార్టీ కార్యాలయంలోకి దూసుకొచ్చి ఫర్నిచర్.. కంప్యూటర్లను వైసీపీ కార్యకర్తలు పగలగొట్టారని చెబుతున్నారు.. అయితే, అనంతరం వైసీపీ కార్యకర్తలను బయటకు పంపిన పోలీసులు. గన్నవరం టీడీపీ కార్యాలయంలో ఉన్న ఓ వస్తువును తీసుకెళ్లారని చెబుతున్నారు.. సీసీ టీవీ ఫుటేజ్‌ ప్రకారం.. ఓ వస్తువును తన జేబులో పెట్టుకుని వెళ్లిపోయాడు కానిస్టేబుల్‌.. ఇంతకీ అది ఏంటి? అనేది తెలియాల్సి ఉండగా.. మేం బాధితులం.. మాపై కేసులు పెట్టడం ఏంటి.. అరెస్ట్‌లు చేయడం ఏంటి? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నేతలు.

Show comments