Site icon NTV Telugu

Buddha Venkanna: వైసీపీ ప్లీనరీపై బుద్దా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు

Buddha Venkanna

Buddha Venkanna

గుంటూరు నాగార్జున యూనివర్శిటీ దగ్గర వైసీపీ నిర్వహించిన రెండు రోజుల ప్లీనరీపై టీడీపీ తీవ్ర విమర్శలు చేసింది. వైసీపీ ప్లీనరీలో జెమినీ సర్కస్ ఎలా ఉండేదో అలా ఉంది.రెండు రోజులపాటు జగన్ సర్కస్ నడిచింది.సర్కస్ లో వివిధ రకాల జంతువులంతా అక్కడికి చేరాయి విన్యాసాలు చేశాయి.420, 840లు చింతామణి నాటక దారులు, అంతా కూడా వైసీపీ ప్లీనరీలో నటించారు.జగన్ హావభావాలు చూస్తుంటే ఇలాంటి వ్యక్తిని ఎందుకు సీఎం చేశామని ప్రజలు ఛీ కొడుతున్నారు.
Heavy Rains: దేశవ్యాప్తంగా భారీ వర్షాలు.. కర్ణాటక, తెలంగాణలో రెడ్‌ అలర్ట్

తెల్ల గడ్డం, నల్లగ గడ్డం, 16 నెలలు చిప్పకూడు తిన్న కుక్కలు చంద్రబాబుపై ఇష్టం వచ్చినట్టు ట్విటర్లో పోస్ట్ చేస్తున్నారు.నల్ల పిచ్చికుక్క ఇష్టం వచ్చినట్టు వాగుతాడు.ఇష్టమొచ్చినట్టు విమర్శిస్తున్న నల్ల కుక్క రూ. 30 కోట్లకు అమ్ముడుపోయాడు.కుక్కల బండ్లు ఎక్కించి, ఎద్దుల బండి ఎక్కించి ఊరంతా తిప్పి అమరావతిలో పెద్ద గొయ్యి తీసి ఈ కుక్కల్ని అందులో కప్పిపెట్టాలి.చంద్రబాబుని ఇష్టం వచ్చినట్టు విజయ్ సాయి, కొడాలి నాని కుక్కల్లా వాగుతున్నారు.జగన్ను ఎప్పటికైనా గద్దెదించి పెద్దిరెడ్డి గద్దెనెక్కుతాడనే భయం పట్టుకుంది.విజయమ్మను బెదిరించి భయపెట్టి ఇడుపులపాయలో నుంచి ఎక్కించుకొచ్చి తల్లి ని కుర్చీలో కూర్చోబెట్టి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడు జగన్.చంద్రబాబుని లోకేష్ ని ఎవరైనా తిడుతుంటే పైశాచిక ఆనందాన్ని జగన్ పొందుతున్నాడు.

తల్లి చేత రాజీనామా చేయించి కన్న తల్లి చేత కన్నీళ్లు పెట్టించి సభ నుంచి పంపించాడు.సభ నుంచి కన్నీళ్లు పెట్టుకొని విజయమ్మ వెళ్ళిపోయింది. మహారాష్ట్రలో జరగబోయేది ఇక్కడ జరగబోతుంది. జగన్ ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా శాశ్వత అధ్యక్షుడిగా ఉంటున్నారు. నల్ల గడ్డం, తెల్ల గడ్డం ,చింతామణి, ముగ్గురు నోరు అదుపులో పెట్టుకోండి. దాడులు.. ప్రతి దాడులు చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం అని హెచ్చరించారు బుద్దా వెంకన్న.

Chiyan Vikram: ఆరోగ్యంపై విక్రమ్ వీడియో సందేశం.. ఏమన్నారంటే?

Exit mobile version