Taneti Vanitha: దళితుల్ని అన్ని విధాలుగా ఆదుకుంది వైసీపీ ప్రభుత్వమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Taneti Vanitha Counter To Chadrababu Naidu Over Dalit Attacks Issue: దళితులపై అత్యాచారాలు, హత్యలు అంటూ ఓ వార్తా పత్రిక ప్రచురించిన కథనంపై హోంమంత్రి తానేటి వనిత స్పందించారు. దళితులకు ఏ కష్టం వచ్చినా, వెంటనే ఆదుకుంది తమ వైసీపీ ప్రభుత్వమేనని అన్నారు. దళితులకు అత్యధిక భద్రత కల్పిస్తోంది కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని చెప్పారు. దళితులపై దాడులు జరిగిన ఘటనలకు సంబంధించి తాము వెనువెంటనే చర్యలు తీసుకున్నామని, బాధితులకు న్యాయం జరిగేలా చేశామని గుర్తు చేశారు. ఇటువంటి వాటిని పచ్చ మీడియా ఎందుకు ప్రచురించడం లేదని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో దళితులపై ఎన్నో దారుణాలు జరిగాయని, మరి ఆ దాడుల గురించి పచ్చ మీడియా ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. టీడీపీ హయాంలో దళితులపై దాడులకు సంబంధించి.. ఆంధ్ర రాష్ట్రం దేశంలోనే 4వ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు.
Viral: I AM SORRY సంజూ అంటూ ఏకంగా హోర్డింగ్ పెట్టిన ప్రియుడు
Also Read
- Polavaram Tiger: పోలవరం జిల్లాలో పులి సంచారం కలకలం.. గండి పోశమ్మ మార్గంలో అప్రమత్తం!
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతి అభివృద్ధి, కీలక సంక్షేమ నిర్ణయాలపై చర్చ!
- Betting: కోట్లు కురిపించే 'క్రికెట్ బెట్టింగ్' డాన్.. ఎట్టకేలకు దొరికిపోయాడుగా.. వెలుగులోకి సంచలన నిజాలు..
- Pawan Kalyan: మావిగన్ పేరు వినడానికే చిరాకుగా ఉంది.. పవన్ ఫైర్
దళితులను సీఎం వైఎస్ జగన్ అన్ని రకాలుగా ఆదుకున్నారని.. వారికి రాజకీయంగా, సామాజికంగా ఎన్నో అవకాశాలు కల్పించారని తానేటి వనిత పేర్కొన్నారు. తనలాంటి సాధారణ దళిత మహిళకు రాష్ట్ర హోంమంత్రిగా అవకాశం కల్పించింది జగనన్నేనని చెప్పారు. మరి, టీడీపీ హయాంలో దళితులకు హోంమంత్రి పదవి ఎందుకు ఇవ్వలేకపోయారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎక్కడో జరిగిన ఒకట్రెండు సంఘటనల్ని బూచిగా చూపించి.. వైసీపీకి దళితుల్ని దూరం చేయాలనే కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. అది ఎప్పటికీ సాధ్యం కాదని తేల్చి చెప్పారు. దళితులంతా సీఎం జగన్ వెంటే ఉన్నారని పేర్కొన్నారు. పచ్చ మీడియా రాసే వార్తల్ని ఎవ్వరూ నమ్మొద్దని, అసలు వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ తమ వైసీపీ గెలుస్తుందని, మరోసారి జగన్ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు.
Amabati Rayudu : ప్రజాసేవ చేయాలన్న ఆలోచన ఉంది.. అది ఏ ఫ్లాట్ ఫామ్ పై అనేది త్వరలో చెప్తా
తాజావార్తలు
-
PF Money: ఉద్యోగం మారిన తర్వాత పీఎఫ్ విషయంలో ఈ తప్పు చేస్తే భారీ నష్టం తప్పదు!
-
AA 23 : అల్లు అర్జున్ – లోకేష్ కనకరాజ్ సినిమా ఆగిపోయిందా? అసలు నిజమిదే!
-
TMC Rebellion: నాడు ఠాక్రే, నేడు మమత.. దేశ రాజకీయాల్లో రెండు ముక్కలుగా చీలిపోయిన అతిపెద్ద పార్టీలు ఇవే..
-
Crime Thriller OTT : మనిషి శరీరానికి జంతువుల తలలను తగిలించే సైకో… ఓటీటీలో భయపెడుతున్న ఇంటెన్స్ థ్రిల్లర్
-
Virat Kohli Injured: టీమిండియాకు భారీ షాక్.. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్కు కోహ్లీ దూరం.!
ట్రెండింగ్
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!