NTV Telugu Site icon

Taneti Vanitha: దళితుల్ని అన్ని విధాలుగా ఆదుకుంది వైసీపీ ప్రభుత్వమే

Taneti Vanitha On Dalit Att

Taneti Vanitha On Dalit Att

Taneti Vanitha Counter To Chadrababu Naidu Over Dalit Attacks Issue: దళితులపై అత్యాచారాలు, హత్యలు అంటూ ఓ వార్తా పత్రిక ప్రచురించిన కథనంపై హోంమంత్రి తానేటి వనిత స్పందించారు. దళితులకు ఏ కష్టం వచ్చినా, వెంటనే ఆదుకుంది తమ వైసీపీ ప్రభుత్వమేనని అన్నారు. దళితులకు అత్యధిక భద్రత కల్పిస్తోంది కూడా సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మాత్రమేనని చెప్పారు. దళితులపై దాడులు జరిగిన ఘటనలకు సంబంధించి తాము వెనువెంటనే చర్యలు తీసుకున్నామని, బాధితులకు న్యాయం జరిగేలా చేశామని గుర్తు చేశారు. ఇటువంటి వాటిని పచ్చ మీడియా ఎందుకు ప్రచురించడం లేదని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో దళితులపై ఎన్నో దారుణాలు జరిగాయని, మరి ఆ దాడుల గురించి పచ్చ మీడియా ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. టీడీపీ హయాంలో దళితులపై దాడులకు సంబంధించి.. ఆంధ్ర రాష్ట్రం దేశంలోనే 4వ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు.

Viral: I AM SORRY సంజూ అంటూ ఏకంగా హోర్డింగ్‌ పెట్టిన ప్రియుడు

దళితులను సీఎం వైఎస్ జగన్ అన్ని రకాలుగా ఆదుకున్నారని.. వారికి రాజకీయంగా, సామాజికంగా ఎన్నో అవకాశాలు కల్పించారని తానేటి వనిత పేర్కొన్నారు. తనలాంటి సాధారణ దళిత మహిళకు రాష్ట్ర హోంమంత్రిగా అవకాశం కల్పించింది జగనన్నేనని చెప్పారు. మరి, టీడీపీ హయాంలో దళితులకు హోంమంత్రి పదవి ఎందుకు ఇవ్వలేకపోయారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎక్కడో జరిగిన ఒకట్రెండు సంఘటనల్ని బూచిగా చూపించి.. వైసీపీకి దళితుల్ని దూరం చేయాలనే కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. అది ఎప్పటికీ సాధ్యం కాదని తేల్చి చెప్పారు. దళితులంతా సీఎం జగన్ వెంటే ఉన్నారని పేర్కొన్నారు. పచ్చ మీడియా రాసే వార్తల్ని ఎవ్వరూ నమ్మొద్దని, అసలు వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ తమ వైసీపీ గెలుస్తుందని, మరోసారి జగన్ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు.

Amabati Rayudu : ప్రజాసేవ చేయాలన్న ఆలోచన ఉంది.. అది ఏ ఫ్లాట్ ఫామ్ పై అనేది త్వరలో చెప్తా

Show comments