శ్రీకాకుళం జిల్లానీటి యాజమాన్య భవనాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి సీదిరి అప్పలరాజు లు ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. సినీ ఇండస్ర్తీ మీద చంద్రబాబు, లోకేష్ ఎప్పుడూ లేనివిధంగా ట్విట్స్ చేస్తున్నారని ఆయన అన్నారు. సినిమాలను రాజకీయాలకు ఉపయోగించుకొవాలని చూస్తున్నారని, పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన ప్రేమున్నట్లు మాటాడుతున్నారన్నారు. ఎన్టీఆర్ వారసుడు టీడీపీ కోసం ఎంతో శ్రమించిన జూనియర్ ఎన్టీఅర్ సినిమాకోసం ఏనాడూ చంద్రబాబు, లోకేష్ ఆలోచించలేదని మండిపడ్డారు. రాజకీయం, స్వప్రయోజనాల కోసం ఎంతకైనా దిగజారుతారు, ఎవరి కాళ్లు అయినా పట్టుకుంటారని ఆయన విమర్శించారు.
ఫిలిం ఇండస్ర్టీ పెద్దలు, ప్రభుత్వం చర్చించి, ఒక కమిటీ వేసి రిపొర్ట్ ఇవ్వాలని అడిగామని, రిపోర్ట్, జీవో విషయంలో ఎక్కడా జాప్యం లేదని ఆయన వెల్లడించారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి సినిమాల విషయంలో ఇబ్బందులు పెట్టారని, సినిమా బాగుంటే ఆడుతుందని, అఖండ, చిన్నసినిమా డీజే టిల్లు బాగా ఆడాయని ఆయన వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ అయినా అకిరానందన్ అయినా ఒకటేనని, జీవో రాకముందే సినిమా రిలీజ్ చేసి, ఏం చేయలేదనటం తప్పని ఆయన అన్నారు. మరో నాలుగు రోజులు రిలీజ్ వాయిదా వేసుకుంటే అనుకున్నట్లు షోలు, రేట్లు పాజిటివ్ వచ్చేవని, ఫిలిం ఇండస్ర్తీ డెవలప్ చేయటానికి ప్రభుత్వం కృషిచేస్తుందని ఆయన తెలిపారు. పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేకంగా ఏదో చెయ్యాలనుకుంటే ప్రభుత్వానికి సాధ్యపడదని ఆయన స్పష్టం చేశారు.