సరదా కోసం విహారయాత్రలకు వెళ్లే యువతీయువకులు ఈత కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంచుమించు గత కొంతకాలంగా ఈ తరహా ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. నెల్లూరు జిల్లా ఆత్మకూరుకి చెందిన ఓ ఇంజనీరింగ్ స్టూడెంట్ఈత సరదాతో పెన్నానదిలో గల్లంతయ్యాడు. పేరారెడ్డిపల్లెకి చెందిన అన్నం లోకేష్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అతని స్నేహితులు బాలాజీ, రమణయ్య, లోకేష్ ఫ్రెండ్స్. వీరంతా పెన్నానదిలో సరదాగా ఈతకోసం వెళ్లారు. వీరంతా నీటి ఉధృతిలో చిక్కుకున్నారు. స్థానికులు వెంకటరమణయ్య, బాలాజీలను కాపాడారు. లోకేష్ మాత్రం ప్రవాహంలో కొట్టుకుపోయాడు. గాలింపు అనంతరం లోకేష్ డెడ్ బాడీ లభించింది. చేతికి అంది వచ్చిన కొడుకు తిరిగి రాని లోకాలకు పోవడంతో తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు.
ఇటు గుంటూరు జిల్లా, తెనాలి మండలంలో ఓ ఉద్యోగి నీటిలో గల్లంతయ్యాడు. దేవుని దర్శనం కోసం వచ్చి స్నానం కోసం దిగిన ప్రైవేటు ఉద్యోగి నదీ ప్రవాహానికి గల్లంతైన ఘటన శనివారం తెనాలి మండలం సంఘం జాగర్లమూడిలో చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న రవీంద్ర సింగ్ తెనాలిలో మీటింగ్ నిమిత్తం శుక్రవారం రాత్రి రాగా శనివారం ఉదయం జాగర్లమూడి లోని సంగమేశ్వర స్వామి ఆలయానికి దర్శనానికి వెళ్లి నేపథ్యంలో స్నానం చేయబోయాడు.
Read Also: Gujarat: రాష్ట్రవ్యాప్తంగా సామూహిక సెలవులో ఉపాధ్యాయులు, ఉద్యోగులు
ఈ తరుణంలో నదీ ప్రవాహానికి బలయ్యారు. కంపెనీ ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం నరసరావుపేటకు చెందిన రవీంద్ర సింగ్ కంపెనీలో ఉన్నత స్థితిలో ఉన్నారని కాలువలో స్నానానికి వెళ్లి గల్లంతు కావడం దురదృష్టకరమన్నారు. ఈత వచ్చిన అతను ప్రవాహాన్ని అడ్డుగోలేకపోయారని పేర్కొన్నారు. అతనికి భార్య, కుమార్తె ,కుమారుడు ఉన్నారని తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ,కంపెనీ అధికారులకు ఘటన గురించి తెలియజేయడం జరిగిందని వివరించారు.
Read Also: KRJ Bharath: ఏపీ శాసనమండలి ఛైర్మన్‌గా కుప్పం వైసీపీ నేత.. ఫోటో వైరల్..!!
