Swamyji Sampoornananda: విశాఖలో బయటపడ్డ కీచక స్వామీజీ లీలలు.. బాలికపై లైంగిక దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Swamiji Sampoornananda Molested Young Girl In Vizag: అందరూ కాదు కానీ, కొందరు మాత్రం స్వామీజీ ముసుగులో ఎన్నో అచారకాలకు పాల్పడుతున్నారు. అక్రమ దందాలు నడపడమే కాదు.. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. మాయమాటలు చెప్పి ముసుగులో దింపడమో, తమ మాట వినకపోతే బలవంతంగా లొంగదీసుకోవడమో చేస్తున్నారు. చివరికి.. మైనర్ బాలికల్ని కూడా విడిచిపెట్టడం లేదు ఈ కామాంధులు. ఇప్పుడు విశాఖపట్నంలోనూ ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. స్వామీజీ ముగుసులో లీలలు కొనసాగిస్తున్నట్టు గుట్టు రట్టయ్యింది. ఓ బాలిక సాహసం వల్లే.. ఆ స్వామీజీ బండారం బయటపడింది.
Ambati Rambabu: పవన్ కళ్యాణ్‌పై అంబటి సంచలన ఆరోపణలు.. రష్యాలో ఫైల్ ఓపెన్
Also Read
ఆ స్వామీజీ పేరు సంపూర్ణనంద. విశాఖపట్నంలోని వెంకోజీపాలెంలో శ్రీశ్రీశ్రీ జ్ఞానానంద పేరుతో ఒక ఆశ్రమం నడుపుతున్నాడు. ఈ ఆశ్రమంలో ఓ బాలిక పెరుగుతోంది. రాజమండ్రి దగ్గరలోని గండెపల్లికి చెందిన ఆ బాలిక.. చిన్నప్పుడే తన తల్లిదండ్రుల్ని కోల్పోయింది. తనకు పన్నెండేళ్ల వయసు ఉన్నప్పుడు ఆ ఆశ్రమంలో చేరింది. అప్పటి నుంచి అక్కడే ఉంటున్న ఆ బాలికపై కీచక స్వామి లైంగిక దాడి చేశాడు. ఈ ఘాతుకంతో నరకం అనుభవించిన ఆ బాలిక.. చాకచక్యంగా వ్యవహరించి, ఆ ఆశ్రమం నుంచి బయటపడింది. వారి కంట పడకుండా ఉండాలన్న ఉద్దేశంతో, ఎక్కడికైనా పారిపోవాలనుకొని, ఓ ట్రెయిన్ ఎక్కింది. ఆ ట్రెయిన్లో కంకిపాడుకు చెందిన ఓ కుటుంబానికి ఆ యువతి దొరికింది. తనకు జరిగిన అన్యాయం గురించి వారికి వివరించింది.
Honor Killing: మధ్యప్రదేశ్ లో పరువు హత్య.. ఇద్దరినీ చంపి నదిలో మొసళ్లకేశారు
ఆ కుటుంబం సహాయంతో ఆ బాలిక విజయవాడ సీడబ్ల్యూసీకి చేరింది. అంతకుముందే ఆ కుటుంబం కంకిపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అక్కడి నుంచి ఆ బాలికని తీసుకెళ్లి, విజయవాడ సీడబ్ల్యూకి ఆ కుటుంబం అప్పగించింది. సీడబ్ల్యూసీ ద్వారా ఆ బాలిక దిశ పోలీసుల్ని ఆశ్రయించింది. ఆ బాలిక ఫిర్యాదు మేరకు.. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్‌లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్‌గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్‌కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..