Supreme Court: ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌పై కీలక ఆదేశాలు.. రేపటిలోగా వివరాలు సమర్పించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వ్యవహారంపై గురువారం ఉదయం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై వాదోపవాదాలు జరిగాయి. ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎంతకాలం కొనసాగిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రెండేళ్లకు మించి సస్పెన్షన్ చేయకూడదన్న నిబంధనలు గమనించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన నిర్దేశాలు కోరామని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు వివరించారు. సస్పెన్షన్ కొనసాగించేందుకు నిర్దేశాలు కోరినట్లు కోర్టుకు తెలిపారు.
అయితే రెండేళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని నిర్దేశాలు అడుగుతారా అని ఏపీ ప్రభుత్వ న్యాయవాదిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రేపటిలోగా అన్ని వివరాలతో రావాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. రెండేళ్ల తర్వాత సస్పెన్షన్ కొనసాగించాలన్న వాదనలకు ఆధారాలు చూపాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ ఎస్ఎల్పీపై జోక్యానికి ఆధారాలు కనిపించట్లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. రేపటి తర్వాత విచారణ వాయిదా వేయడం కుదరదని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సమాచారం తెప్పించుకోవాల్సిందేనని సూచించింది. కాగా తదుపరి విచారణను శుక్రవారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
Also Read
Kakani Govardhan Reddy: మంత్రిగా తొలి సంతకం ఏ ఫైలుపై పెట్టారంటే..?
తాజావార్తలు
-
CM Vijay: ఆ స్థానాలే కొనసాగించాలి.. డీలిమిటేషన్‌పై అసెంబ్లీలో విజయ్ తీర్మానం
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
TTD: తిరుమలకు వచ్చే విదేశీ భక్తులకు గుడ్ న్యూస్..
-
Heartin OTT Release: జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రియుడు.. ఓటీటీలోకి కితకితలు పెట్టే ట్రయాంగిల్ లవ్ స్టోరీ
-
Harish Rao: బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా? సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్
ట్రెండింగ్
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?