Site icon NTV Telugu

శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ ఎన్వీ రమణ.. రేపు హైదరాబాద్‌కు..

CJI

CJI

తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ దంపతులు.. స్వామివారి ఏకాంతసేవలో పాల్గొన్నారు సీజేఐ దంపతులు.. జస్టిస్ ఎన్‌వీ రమణ దంపతులకు ఘనస్వాగతం పలికారు టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి.. అంతకుముందు తిరుమల చేరుకున్న ఆయనకు పద్మావతి అతిథి గృహం వద్ద వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌ రెడ్డి స్వాగతం పలికారు. రేపు మళ్లీ ఎన్వీ రమణ దంపతులు శ్రీవారి సేవలో పొల్గొననున్నారు. ఇక, తిరుమల నుంచి రేపు మధ్యాహ్నం హైదరాబాద్‌కు రానున్నారు సీజేఐ… ఎన్వీ రమణ.. సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత హైదరాబాద్‌కు రావడం ఇదేతొలిసారి.. దీంతో.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో భారత ప్రధాన న్యాయమూర్తికి స్వాగతం పలకనున్నారు మంత్రి కేటీఆర్, ఇతర మంత్రులు.. ఇక, రేపు రాజ్‌భవన్‌లో బస చేయనున్నారు సీజేఐ దంపతులు.

Exit mobile version