తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ… భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన తిరుమలకు రావడం ఇదే తొలిసారి.. ఆయన షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 10వ తేదీన తిరుమలకు రానున్నారు.. రాత్రికే అక్కడే బసచేసి.. 11వ తేదీన శ్రీవారిని దర్శించుకోనున్నారు.. ఆ తర్వాత ఢిల్లీకి తిరుగుప్రయాణం కానున్నారు ఎన్వీ రమణ.. కాగా, ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా నియమితులైన తర్వాత కూడా తిరుమలకు వచ్చి శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకున్నారు.. ఈ సందర్భంగా అధికారులు ఆయన ఘన స్వాగతం పలికారు. టీటీడీ చైర్మన్ వైవీసుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. ఇక, చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శ్రీవారి దర్శనం కోసం ఆయన వస్తుండడంతో.. తగిన ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.
తిరుమలకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ..

CJI NV Ramana