Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Sunitha Reddy Letter To Lok Sabha Speaker Om Birla On Ys Vivekananda Reddy Murder Case

YS Viveka Case: లోక్‍సభ స్పీకర్‌కు సునీతారెడ్డి లేఖ.. హత్యలో అవినాష్‌రెడ్డి హస్తం..!

Published Date :February 28, 2022 , 1:27 pm
By Sudhakar Ravula
YS Viveka Case: లోక్‍సభ స్పీకర్‌కు సునీతారెడ్డి లేఖ.. హత్యలో అవినాష్‌రెడ్డి హస్తం..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆంధ్రప్రదేశ్‌లో కలకలం సృష్టించిన మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు ఇప్పుడు సంచలనంగా మారుతోంది.. ఇప్పటికే ఈ వ్యవహారంలో రాజకీయ విమర్శల పర్వం కొనసాగుతుండగా.. తాజాగా వైఎస్‌ వివేకానందరెడ్డి కూతురు సునీతారెడ్డి సీబీఐ వాంగ్మూలంలో చేసిన వ్యాఖ్యలు చర్చగా మారాయి.. మరోవైపు.. ఈ వ్యవహాంలో లోక్‍సభ స్పీకర్ ఓంబిర్లాకు లేఖ రాశారు వైఎస్ వివేకా కుమార్తె సునీతారెడ్డి… వివేకా హత్య కేసులో ఎంపీ ఆవినాష్ రెడ్డి హస్తం ఉందని లేఖలో స్పీకర్‌ దృష్టికి తీసుకెళ్లిన ఆమె.. ఎంపీ అవినాష్ రెడ్డి పాత్రపై విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇక, సీబీఐకి తానిచ్చిన వాంగ్మూలాన్ని స్పీకర్‌కు రాసిన లేఖతో జతపరిచారు సునీతారెడ్డి.. అంతేకాకుండా సీబీఐకి నిందితులిచ్చిన వాంగ్మూలాలను కూడా స్పీకర్‍కు అందజేశారు.

Read Also: YS Viveka Murder Case: సీబీఐ వాంగ్మూలం.. సునీతారెడ్డి సంచలన వ్యాఖ్యలు..

ఇక, వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన కూతురు సునీతారెడ్డి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలోని కీలక అంశాలను బయటపెట్టిన విషయం తెలిసిందే.. మా నాన్నను ఎవరు చంపారో అందరికీ తెలుసన్న ఆమె.. నాన్న హత్యపై వైఎస్‌ జగన్‌, వైఎస్‌ భారతి చాలా తేలిగ్గా స్పందించారని.. నాన్న హత్య విషయంలో జగనన్న వ్యాఖ్యలు బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు.. హత్య గురించి అనుమానితుల పేర్లను జగనన్నకు చెప్పా.. వాళ్లను ఎందుకు అనుమానిస్తున్నావు.. నీ భర్తే హత్య చేయించాడేమో అని అన్యాయంగా మాట్లాడారని.. కేసు సీబీఐకి అప్పగిస్తే అవినాష్‍కు ఏమీకాదు.. బీజేపీలో చేరతాడని చెప్పారని.. ఇప్పటికే మాపై 11 కేసులున్నాయి.. మీది 12వది అవుతుందన్నారని పేర్కొన్నారు. నా తండ్రి హత్యను వైఎస్‌ జగన్ రాజకీయ సానుభూతి కోసం వాడుకున్నారని సీబీఐకి తెలిపిన ఆమె.. సీబీఐ విచారణ కోసం నేను కోర్టుకు వెళ్తే జగన్ రాజకీయ భవిష్యత్తు.. నాశనమయ్యే ప్రమాదం ఉందని వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారని పేర్కొన్నారు.. అవినాష్‌ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, ఎర్రగంగిరెడ్డిల డైరెక్షన్‍లో ఆధారాలను మాయం చేశారని ఆరోపించారు.. అవినాష్‌ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మనోహర్‍ రెడ్డిలతో పాటు మరికొందరు అనుమానితులను విచారిస్తే నిజాలు బయటపడతాయని సీబీఐకి తెలిపారు. నా తండ్రి అంటే ఎంపీ అవినాష్‌కు గిట్టదు అని పేర్కొన్నారు.. హంతకులకు శిక్ష పడాలని.. గత్యంతరం లేక సీబీఐని ఆశ్రయించానంటూ సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు సునీతారెడ్డి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • CBI
  • CM YS Jagan
  • Lok Sabha Speaker Om birla
  • MP Avinash Reddy
  • Sunitha Reddy

తాజావార్తలు

  • NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని మూవీ సాంగ్ లోడింగ్.. థమన్ మార్క్ మ్యూజిక్ రెడీ!

  • IPL 2026: తారలు దిగివచ్చిన వేళ.. ముంబై వర్సెస్ బెంగళూరు పోరులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది వీరే!

  • Sara Tendulkar: లక్నో, గుజరాత్ మ్యాచ్‌లో వదిన-మరదళ్ల సందడి.. సారా టెండూల్కర్ మద్దతు ఎవరికి?

  • Kiran Abbavaram : మల్టీటాస్క్స్ చేస్తూ.. టాలెంట్ చూపిస్తున్న కిరణ్ అబ్బవరం.

  • Palnadu Police Crime: పల్నాడులో క్రిమినల్స్‌గా మారిపోయిన పోలీసులు.. వరుస ఘటనలు.. తాజాగా లాయర్‌ హత్య..

ట్రెండింగ్‌

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions