తెలుగు రాష్ట్రల్లో ఈనెల ఆరంభంలో భారీగా పడిన వర్షాలు ఇప్పుడు కాస్త తగ్గాయి. అలాగే ఎగువ నుండి కూడా వరద కూడా రాకపోవడంతో శ్రీశైలం జలాశయంకి వచ్చిన వరద నీరు పూర్తిగా నిలిచిపోయింది. అయితే ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో మరియు ఔట్ ఫ్లో కూడా పూర్తిగా నిల్ గా ఉంది. ఇక శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 818.70 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం 39.9087 టీఎంసీలు ఉంది. ఇక ఇప్పటికి కుడి గట్టు, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి ప్రస్తుతం జరగడం లేదు.