Seediri Appalaraju: శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును కాశీబుగ్గ పోలీసులు శనివారం నాడు విచారించారు. ఈ సందర్భంగా అతడ్ని పోలీసులు విడిచి పెట్టారు. మళ్ళీ సోమవారం రావాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక, అప్పలరాజు మాట్లాడుతూ.. లైంగిక వేధింపులకు గురైన మైనర్ బాలికకు న్యాయం చేయమని డిమాండ్ చేస్తే నాపై కేసు పెట్టారని ఆరోపించారు. బాధిత కుటుంబ సభ్యులు న్యాయం కోసం అప్పట్లో నా దగ్గరకు వచ్చారు.. మైనర్ బాలిక, ఆమె తల్లి ఏ విధంగా లైంగిక వేధింపులకు గురయ్యారు వారే అప్పట్లో మీడియా ముందు చెప్పారు.. వారికి న్యాయం చేయమని కోరితే నాపై కేసులు పెడతారా? అని ప్రశ్నించారు.
Read Also: Jana Nayagan : తమిళనాడునీ ఊపేస్తున్న ఇళయదళపతి విజయ్ కచేరి..
అయితే, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? అని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అడిగారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇక్కడ అరాచక పాలన నడుస్తుంది.. పోలీసులను తప్పు పట్టడానికి లేదు.. వారిపై ప్రభుత్వ పెద్దల ఒత్తిడి ఉంది అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక నాపై ఎనిమిది కేసులు పెట్టారు.. 2014 -19 మధ్య కూడా ఐదారు కేసులు పెట్టారని గుర్తు చేశారు. అయితే, రాష్ట్రంలో ప్రశ్నిస్తే కేసులు పెట్టడం అలవాటుగా మారిపోయిందని సీదిరి అప్పలరాజు అన్నారు.