DGP Dwaraka Tirumala Rao: టెక్నాలజీని విరివిగా వాడుకుంటున్నాం.. మార్చి లోపు లక్ష కెమెరాలు ఏర్పాటు..

  • టెక్నాలజీని విరివిగా వాడుకుంటున్నాం..
  • మార్చి నెలలోపు లక్ష కెమెరాలు ఏర్పాటు చేస్తా..
  • శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు..
Ap Dgp

Ap Dgp

DGP Dwaraka Tirumala Rao: టెక్నాలజీని విరివిగా వాడుకుంటున్నాం.. మార్చి నెలలోపు లక్ష కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు.. ప్రతి జిల్లాలో సీసీ టీవీ ‌కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించిన ఆయన.. ప్రభుత్వంతో పాటు ప్రజలు‌ కూడా సీసీ కెమెరాలు పెట్టేవిధంగా ప్రయత్నిస్తున్నాం అన్నారు.. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా శ్రీకాకుళం రావట‌ం జరిగింది. మొదటి ప్రయారిటీ గంజాయిని అరికట్టాం.. ఏజెన్సీలో ఎక్కువ గంజాయి ఉండటంతో గంజాయి రహితంగా చేసేకార్యక్రమాలు చేపట్టాం అన్నారు. సంకల్ప కార్యక్రమం ద్వారా యువతకు చైతన్య కార్యక్రమాలు నిర్వహించడం.. చెడు అలవాట్లకు బానిస కాకుండా చూస్తున్నాం అన్నారు..

Read Also: HYDRA: అమీన్ పూర్‌లో హైడ్రా అధికారుల కూల్చివేతలు

ఇక, మిగిలిన అన్ని క్రైమ్‌లు తగ్గాయి.. కానీ, సైబర్ క్రైమ్‌ పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు ఏపీ డీజీపీ.. సైబర్ క్రైమ్‌ పై ప్రజలలో అవగాహన తీసుకువస్తున్నాం అని వెల్లడించారు.. మరోవైపు.. డిజిటల్ అరెస్ట్ అనేది చట్టంలో లేదు.. అలాంటి కాల్స్‌ వస్తే భయపడాల్సిన అవసరం లేదని సూచించారు.. నిపుణుల సహకారంతో సైబర్ పోలిస్ స్టేషన్లు జిల్లాకు ఒకచోట ఏర్పాటు చేస్తాం అన్నారు.. ఇక, పిల్లలు‌, వృద్ధులపై అత్యాచారాలు చేస్తున్నారు.. సమాజంకు ఇది సిగ్గు చేటు‌ అని వ్యాఖ్యానించారు.. మావోయిస్టుల కదలిలకపై నిఘా ఉంది. ఏవోబీని సెల్టర్ జోన్ గా వాడుకోవాలనుకుంటే పోలీసులు అంత అసమర్థంగా లేరు అని హెచ్చరించారు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు.