High Tension in Raptadu: పరామర్శకు వెళ్లిన వైఎస్ జగన్.. రాప్తాడులో టెన్షన్ టెన్షన్..!
- హీట్ పెంచుతున్న వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పర్యటన..
- రాప్తాడు నియోజకవర్గంలో జగన్ పర్యటన..
- హత్యకు గురైన కురుబ లింగమయ్య కుటుంబానికి పరామర్శ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
High Tension in Raptadu: వైఎస్‌ఆర్ కాంగ్రెస పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పర్యటన.. ఇప్పుడు రాప్తాడు నియోజకవర్గంలో కాకరేపుతోంది.. ఇటీవల దారుణ హత్యకు గురైన కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు శ్రీసత్యసాయి జిల్లాకు వెళ్లారు జగన్.. రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలంలోని పాపిరెడ్డిపల్లిలో గత నెల 30వ తేదీన వైసీపీ నేత కురుబ లింగమయ్య కుటుంబంపై దాడి చేశారు.. ఈ ఘటనలో లింగమయ్య తీవ్రగాయాలపాలు కాగా.. ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు.. ఈ ఘటన రాప్తాడు నియోజకవర్గంలో పొలిటికల్ హీట్‌ను పెంచింది..
Read Also: Chiranjeevi: పవన్ కల్యాణ్ కుమారుడికి గాయాలు.. స్పందించిన చిరంజీవి..
Also Read
- Govt Employee Turns Chain Snatcher: షేర్ మార్కెట్ నష్టాలు.. ప్రభుత్వ ఉద్యోగి దొంగగా మారిన షాకింగ్ ఘటన..!
- Massive Explosion in Kadiri: కదిరిలో భారీ పేలుడు.. నలుగురు అక్కడికక్కడే మృతి.. 12 మందికి సీరియస్..
- BV Raghavulu: చంద్రబాబు, జగన్‌పై బీవీ రాఘవులు ఘాటు వ్యాఖ్యలు..
- Minister Satya Kumar Dance: సంక్రాంతి సంబరాల్లో మంత్రి సత్యకుమార్ సూపర్ డ్యాన్స్..
ఈ హత్యపై రాజకీయ విమర్శలు లేకపోలేదు. నిందితులు రాప్తాడు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పరిటాల సునీత దగ్గరి బంధువులు అనే ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ నేతలు.. అందుకే లింగమయ్య అంత్యక్రియలకు ఎవరినీ అనుమతించకుండా పోలీసులను పెట్టారని మండిపడ్డారు.. మరోవైపు.. బాధిత కుటుంబ సభ్యులను ఫోన్‌లో పరామర్శించి ధైర్యం చెప్పిన వైఎస్ జగన్.. ఈ రోజు నేరుగా వారి ఇంటికే వెళ్లి పరమార్శిస్తున్నారు.. కానీ, జగన్ టూర్ పొలిటికల్ హీట్ పెంచుతోంది.. ఆ నియోజకవర్గం నుంచి పరిటాల సునీత ప్రాతినిథ్యం వహిస్తున్నారు.. జగన్ పర్యటనపై సునీత.. సోమవారం రోజు సంచలన వ్యాఖ్యలు చేశారు.. మేం ఆపాలి అనుకుంటే.. జగన్ వచ్చే హెలికాప్టర్‌ను ఇక్కడ దిగకుండానే వెనక్కి పంపించగలం.. మా పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా అదే కోరుకుంటున్నారు.. కానీ, మా పార్టీ అధినేత చంద్రబాబు.. అలాంటి రాజకీయాలు మాకు నేర్పలేదని పేర్కొన్నారు.. అయితే, జగన్ పర్యటనను టీడీపీ శ్రేణులు.. లేదా కూటమికి చెందిన పార్టీల శ్రేణులు అడ్డుకునే అవకాశం ఉందనే ప్రచారం నేపథ్యంలో.. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.. మొత్తంగా వైఎస్ జగన్ పర్యటన.. రాప్తాడు నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణాన్ని సృష్టిస్తోంది..
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..