SBI Bank Robbery: శ్రీ సత్యసాయి జిల్లా తూముకుంట ఎస్బీఐ బ్రాంచ్ దోపిడీ కేసులో పురోగతి లభించింది. హిందూపురం మండలం తూముకుంట చెక్ పోస్ట్ వద్ద గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ లో జరిగిన చోరీ నిందితులను పోలీసులు గుర్తించారు. గత 20 రోజులుగా కేసు విచారణలో భాగంగా పలు రాష్ట్రాల్లో పర్యటించి, పాత నేరస్తులను విచారించి, నేరస్థలములో లభించిన సాంకేతిక ఆధారాలను బట్టి హర్యానా రాష్ట్రానికి చెందిన అనిల్ కుమార్ పన్వార్, అతని సహచరులు నేరం చేసినట్లు అన్ని ఆధారాలను వెలికి తీశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అనిల్ కుమార్ పన్వార్ ను హర్యానాలో అదుపులోకి తీసుకుని.. అక్కడి కోర్టులో ఈ రోజు (శనివారం) హాజరుపర్చారు.
Read Also: farmers protest for urea : రైతులందరికీ సరిపడా యూరియా అందిచాలని డిమాండ్!
అయితే, ఈ చోరీ కేసులో ఇంకా విచారణ కొనసాగాల్సి ఉంది. దొంగతనం కేసులో కాజేసిన డబ్బుల యొక్క ఆచూకీ ఇంకా తెలియ రాలేదని పోలీసులు తెలిపారు. లీగల్ ప్రొసీజర్ కచ్చితంగా పాటించవలసి అవసరం మాపై ఉండటం వలన.. ముద్దాయిని వెంటనే కోర్టులో హాజరు పరచాల్సి వచ్చింది అన్నారు. కాగా, ఈ కేసు విషయంలో పూర్తి విచారణ తర్వాత మొత్తం వివరాలను జిల్లా స్థాయి మీడియా సమావేశంలో వెల్లడిస్తామని డీఎస్పీ కేవీ మహేష్ తెలియజేశారు.