CM Chandrababu: ఏ వ్యవస్థకు ఇంతటి శక్తి లేదు.. సత్యసాయి ట్రస్ట్‌పై సీఎం ప్రశంసలు..
- సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింసా అనేది సత్యసాయి ఐదు సూత్రాలు..
- సత్యసాయి చెప్పిన సిద్ధాంతాలు.. సూత్రాలను పాటిస్తే ప్రపంచం శాంతిగా ఉంటుంది..
- ఆంధ్రా, తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో తాగు నీటి సౌకర్యాన్ని కల్పించారు..
- సత్యసాయి బాబాతో నాకు మంచి అనుబంధం ఉందని గుర్తుచేసుకున్న సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: శ్రీ సత్యసాయి బాబా సేవా స్పూర్తి ప్రపంచానికి ఆదర్శమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో.. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మంత్రి నారా లోకేష్‌తో కలిసి పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస.. ఇవే సత్యసాయి జీవన సూత్రాలని, ఇవి ప్రపంచాన్ని శాంతి మార్గంలో నడిపే విలువలని సీఎం గుర్తుచేశారు. సత్యసాయి సేవలు అపారమైనవి అని పేర్కొన్నారు.
Read Also: India-Paksitan War: డ్రాగన్ గలీజ్ “దందా”.. భారత్-పాక్ ఘర్షణను ఆయుధాల ట్రయల్‌కి వాడుకున్న చైనా..
Also Read
- Govt Employee Turns Chain Snatcher: షేర్ మార్కెట్ నష్టాలు.. ప్రభుత్వ ఉద్యోగి దొంగగా మారిన షాకింగ్ ఘటన..!
- Massive Explosion in Kadiri: కదిరిలో భారీ పేలుడు.. నలుగురు అక్కడికక్కడే మృతి.. 12 మందికి సీరియస్..
- BV Raghavulu: చంద్రబాబు, జగన్‌పై బీవీ రాఘవులు ఘాటు వ్యాఖ్యలు..
- Minister Satya Kumar Dance: సంక్రాంతి సంబరాల్లో మంత్రి సత్యకుమార్ సూపర్ డ్యాన్స్..
సత్యసాయి బాబా సేవా కార్యక్రమాల గురించి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో లక్షలాది మందికి తాగునీటి సౌకర్యం అందించిన తొలి సేవా కార్యక్రమం ఇదే అని తెలిపారు సీఎం చంద్రబాబు.. తాగునీటి ప్రాజెక్టుల కోసం ప్రశాంతి నిలయాన్ని తాకట్టు పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నానని సత్యసాయి బాబా చెప్పారని.. అయితే, భక్తుల విరాళాలతో ఆ ప్రాజెక్టులు విజయవంతమయ్యాయని చంద్రబాబు పేర్కొన్నారు. ఇక, సత్యసాయి సేవాసంస్థలో పనిచేస్తున్న వాలంటీర్ల సంఖ్య 7.50 లక్షలు ఉండటం విశేషమని, ఎలాంటి ప్రభుత్వ లేదా ప్రైవేట్ వ్యవస్థకు కూడా ఇంతటి శక్తి లేదని సీఎం అభినందించారు. ఈ ఉత్సవాల సందర్భంగా సత్యసాయి ట్రైబల్ విమెన్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్ ప్రారంభించడం ఆనందకరమని తెలిపారు. ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వారికి సత్యసాయి ట్రస్ట్ అందిస్తున్న వైద్య సేవలు ప్రశంసనీయం అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
PM Modi Paris Speech: 12 ఏళ్లలో నూతన భారత్ ఆవిష్కరణ.. పారిస్‌లో అభివృద్ధి గాథను వివరించిన ప్రధాని మోడీ
-
Papaya Seeds Health Benefits: బొప్పాయి గింజలను పారేస్తున్నారా..? ఈ రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
-
Modi-Macron: ఫ్రాన్స్-భారత్ స్నేహం వర్ధిల్లాలి.. మాక్రాన్ ఆసక్తికర పోస్ట్
-
Jharkhand: రాజ్యసభ విజయం తర్వాత హేమంత్ సోరెన్‌ను కలిసిన బైద్యనాథ్ రామ్
-
Rajyasabha Elections: మా ఓటమికి లెఫ్ట్, ఆర్జేడీలే కారణం.. రాజ్యసభ ఓటమిపై కాంగ్రెస్ ఆగ్రహం..
ట్రెండింగ్
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్‌పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!
-
5 Best Indoor Plants : ఇంట్లో గ్రీనరీ కావాలా.? మట్టిలేకుండా నీటిలో పెరిగే 5 ప్లాంట్స్ ఇవే.!
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..