Site icon NTV Telugu

Minister Savitha: వైసీపీ నాయకులకు మహిళలంటే ఎందుకంత ద్వేషం..

Sabitha

Sabitha

Minister Savitha: భారతదేశ మహిళలను ఇతర దేశాలలో కూడా గౌరవిస్తారు అని కడప జిల్లా ఇంఛార్జ్ మంత్రి సవిత సవిత తెలిపారు. కానీ, మహిళా రైతులు అమరావతి నుంచి తిరుపతికి పాదయాత్రగా వెళ్లినప్పుడు ఎలా అసభ్యకరంగా మాట్లాడారో అందరికీ తెలుసు అని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి తల్లిని, చెల్లిని ఎలా అవమానించారో అందరికీ తెలుసు.. ఎంతో రాజకీయ చరిత్ర కలిగిన ప్రసన్న కుమార్ రెడ్డి కుటుంబానికి చెందిన ప్రశాంతి రెడ్డిని ఇంత అసభ్యకరంగా మాట్లాడం చాలా బాధాకరం అన్నారు. చెల్లెలితో సమానురాలైన ప్రశాంతి రెడ్డిని ఎలా విమర్శించాడు అని మంత్రి సవిత ప్రశ్నించింది.

Read Also: Mallikarjun Kharge: రాష్ట్రపతి పేరు ఉచ్చరిస్తూ నోరు జారిన ఖర్గే.. ముర్ము పేరును ఎలా పలికారో చూడండి..(వీడియో)

ఇక, వైసీపీ నాయకులకు మహిళలంటే ఎందుకు అంత ద్వేషం అని మంత్రి సవిత అడిగింది. మహిళల పట్ల వ్యక్తిగతంగా మాట్లాడడం ఏమాత్రం బాగాలేదు.. ప్రశాంతి రెడ్డికి తక్షణమే ప్రసన్న కుమార్ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందే అని డిమాండ్ చేశారు. నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు మేము సిద్ధం.. మీలా మహిళలను అగౌరపరిచే విధానాన్ని మా అధినేత మాకు నేర్పలేదు అని విమర్శించింది. వైసీపీ నేతలు మహిళలను అగౌరపరచడం దారుణమని మంత్రి సవిత తెలిపింది.

Exit mobile version