Site icon NTV Telugu

Somireddy Chandramohan Reddy: జగన్ రెడ్డిని దేవుడు కూడా క్షమించడు..

Somireddy

Somireddy

Somireddy Chandramohan Reddy: జగన్ రెడ్డిని దేవుడు కూడా క్షమించడు అంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిపై విరుచుకుపడ్డారు టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి.. జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టును జగన్ రెడ్డి ఖండించడంతో ఆడపడుచుల పట్ల ఆయనకున్న ఆలోచనలు బయటపడ్డాయన్న ఆయన.. విశ్లేషకుడిగా కృష్ణంరాజు తెలుగు ఆడపడుచుల గురించి నీచాతినీచంగా, క్రూరంగా మాట్లాడుతుంటే ఆ క్షణమే ఖండించి, క్షమాపణ చెప్పించి, డిబేట్ నుంచి బహిష్కరించాల్సిన బాధ్యత కొమ్మినేనితో పాటు యాజమాన్యానికి లేదా..? అని ప్రశ్నించారు.. ఆ పని అప్పుడు చేసివుంటే ప్రజలు హర్షించేవారు. అది చేయకపోగా వ్యంగ్యంగా నవ్వుతూ ఆ విశ్లేషకుడిని సమర్ధించడం అందరూ చూశారని గుర్తుచేశారు.. అప్పట్లో వల్లభనేని వంశీ, కాకాణి గోవర్ధన్ రెడ్డి లాంటి వారిపై జగన్ రెడ్డి చర్యలు తీసుకోకపోవడంతోనే ఇప్పుడు 11 సీట్లకు పరిమితమయ్యాడని మండిపడ్డారు.. ఈ రోజు ఆడపడుచుల పట్ల తన మనస్సులోని వైఖరిని బయటపెట్టాడు. ఇక జగన్ రెడ్డిని దేవుడు కూడా క్షమించరు అంఊ ఫైర్‌ అయ్యారు టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి.

Read Also: Kaleshwaram Commission: విచారణ అనంతరం ఫామ్‌హౌస్‌కు హరీష్ రావు.. కేసీఆర్‌తో భేటీ!

Exit mobile version