Site icon NTV Telugu

Lookout Notice: మాజీ మంత్రి కాకాణిపై లుక్‌ఔట్‌ నోటీసులు

Kakani Govardhan Reddy

Kakani Govardhan Reddy

Lookout Notice: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డి కోసం పోలీసులు వేట ముమ్మరం చేశారు.. ఆరు బృందాలతో తీవ్రంగా గాలిస్తున్నారు పోలీసులు.. కాకాణిపై నమోదైన కేసుల విషయంలో తాజాగా చోటుచేసుకున్న పరిణామాలతో అప్రమత్తమైన పోలీసులు.. ముందు జాగ్రత్త చర్యగా.. కాకాణి గోవర్ధన్‌రెడ్డి విదేశాలకు వెళ్లకుండా లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు.. తనపై నమోదైన కేసులను క్వాష్‌ చేయాలని కోరుతూ.. మరోవైపు ముందస్తు బెయిల్ కోసం కాకాణి దాఖలు చేసిన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు తిరస్కరించిన విషయం విదితమే.. కాకాణి వ్యవహారంలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది.. ఈ నేపథ్యంలో కాకాణి గోవర్ధన్‌ రెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసుల ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.. అందులో భాగంగా ఆయనపై లుక్‌ఔట్‌ నోటీసులు జారీ చేశారు..

Read Also: Kavya Thapar : తిరిగి ఫామ్ లోకి వచ్చిన హాట్ బ్యూటీ..

కాగా, పోలీసులు నోటీసులు జారీ చేసిన.. విచారణకు హాజరు కాకుండా డుమ్మా కొడుతూ వచ్చారు కాకాణి.. నెల్లూరులో ఆయన అందుబాటులో లేకపోవడంతో.. మొదట ఆయన ఇంటి గోడకు నోటీసులు అంటించి వెళ్లిన పోలీసులు.. ఆ తర్వాత హైదరాబాద్‌లోనైనా నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించారు.. అక్కడ కూడా సాధ్యం కాకపోవడంతో.. కాకాణి కుటుంబ సభ్యులకు నోటీసులు అందించారు.. అయితే, కాకాణి మాత్రం పోలీసుల విచారణకు హాజరుకాకపోవడం.. మరోవైపు.. హైకోర్టులో కూడా ఆయనకు ఎదురుదెబ్బ తగలడంతో.. గాలింపు చర్యలు ముమ్మరం చేశారు పోలీసులు..

Exit mobile version