Nellore Lady Don: నెల్లూరు లేడీ డాన్ అరుణకు పోలీసులు షాక్ ఇచ్చారు. ఆమెపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఈ సందర్భంగా నెల్లూరు జైలు నుంచి కడప సెంట్రల్ జైలుకు తరలించారు. రిపీటెడ్ గా నేరాలు చేస్తున్న రౌడీ షీటర్లపై ఎస్పీ అజిత కఠినంగా వ్యవహరిస్తున్నారు. కోవూరు, నవాబ్ పేట, వేదాయపాలెం పోలీస్ స్టేషన్ లలో ఇప్పటికే అరుణపై పలు కేసులు నమోదు అయ్యాయి.
Read Also: Team India Chasing: 7 మ్యాచ్‌ల్లో 7 ఓటములు.. ఆ టార్గెట్ అంటే భారత్ బెంబేలెత్తిపోతోంది!
అయితే, లేడీ డాన్ అరుణ బయటికీ వస్తే నేరాల్లో ఇన్వాల్ అయ్యే ఛాన్స్ ఉండటంతో ఆమెపై పీడీ యాక్ట్ ప్రయోగించినట్లు పోలీసులు తెలిపారు. రెండేళ్ల కాలంలో ఐదు కంటే ఎక్కువ నేరాలకు పాల్పడితే పీడీ యాక్ట్ పెట్టే అవకాశం ఉంది. పీడీ యాక్ట్ ప్రయోగిస్తే ఏడాది పాటు నో బెయిల్, ఎవరిని కలిసేందుకు అనుమతి ఉండదు అన్నారు. బెయిల్ కావాలంటే హైకోర్టుకు వెళ్లాల్సిందే.. ములాఖాత్ కోసం హోం ప్రిన్సిపల్ సెక్రటరీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది.
