MLA Prashanthi Reddy: నాకు అండగా నిలబడినవారికి కృతజ్ఞతలు.. సీఎం, డిప్యూటీ సీఎం, లోకేష్‌కి ప్రత్యేక ధన్యవాదాలు
- నెల్లూరులో పొలిటికల్ హీట్ పెంచిన ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలు..
- ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి కూటమి, ప్రజాసంఘాల నుంచి మద్దతు..
- తనకు మద్దతుగా నిలిచిన వారికి కృతజ్ఞతలు తెలిపిన ప్రశాంతిరెడ్డి..
- టీడీపీ కుటుంబసభ్యులకు, ప్రజానీకానికి ప్రత్యేక ధన్యవాదాలు..
- సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ కి ప్రత్యేక ధన్యవాదాలు..
- వీడియో విడుదల చేసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Prashanthi Reddy: ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఎపిసోడ్ ఒక్కసారిగా నెల్లూరు పాలిటిక్స్‌లో హీట్ పెట్టింది.. ప్రశాంతి రెడ్డి.. ప్రసన్నకుమార్‌పై విమర్శలు చేయడం.. దాని కౌంటర్ ఇస్తూ ఆయన చేసిన కామెంట్లు వివాదానికి దారి తీశాయి.. ఈ ఎపిసోడ్లో కూటమి నుంచి ప్రశాంతి రెడ్డి.. వైసీపీ నుంచి ప్రసన్నకు మద్దతు లభించింది.. అయితే, సభ్య సమాజం తల దించుకునేలా నా పై జరిగిన మాటల దాడిని ఖండిస్తూ నాకు అండగా నిలబడిన తెలుగుదేశం కుటుంబసభ్యులకు, ప్రజానీకానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటూ ఓ వీడియో విడుదల చేశారు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి..
Read Also: Exclusive : టాలీవుడ్ ఫ్లాపుల వీరులు.. ఎవరెవరు ఎన్నేన్ని డిజాస్టర్స్ కొట్టారంటే
Also Read
- Chandrababu, Pawan Kalyan: నేడు నెల్లూరు జిల్లాలో చంద్రబాబు, డిప్యూటీ సీఎం పర్యటన..
- Nara Lokesh: కూటమిపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. “నో క్రాస్‌ఫైర్, నో మిస్‌ఫైర్..
- MP Mithun Reddy: వైసీపీదే హవా.. నెల్లూరులో మిథున్ రెడ్డి ధీమా
- Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
ఈ కష్ట సమయంలో నాకు అండగా నిలబడిన సీఎం నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిజయేశారు ప్రశాంతి రెడ్డి.. అలాగే మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, సహచర ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, పార్టీ జిల్లా అధ్యక్షులకు, వివిధ హోదాల్లో ఉన్న ఎందరో నేతలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపిన ఆమె.. నా కోసం క్షేత్రస్థాయిలో పోరాటాలు చేసిన మహిళామణులకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా మీద అభిమానంతో మేమున్నామంటూ జిల్లావ్యాప్తంగా తరలివచ్చి నాకు సంఘీభావం ప్రకటించిన వీపీఆర్ అభిమానులకు, కోవూరు నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలకు రుణపడి ఉంటానని పేర్కొన్నారు.. అలాగే నాకు నైతిక మద్దతు అందించిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అన్నారు.. మీ అందరి మద్దతుతో మనోధైర్యాన్ని కూడగట్టుకుని ప్రజలకు మరింత మెరుగైన పాలన అందించేందుకు సర్వదా సిద్ధంగా ఉంటానని తెలియజేస్తున్నాను అంటూ ఆ వీడియోలో పేర్కొన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి..
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?