MLA Prashanthi Reddy: ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఎపిసోడ్ ఒక్కసారిగా నెల్లూరు పాలిటిక్స్‌లో హీట్ పెట్టింది.. ప్రశాంతి రెడ్డి.. ప్రసన్నకుమార్‌పై విమర్శలు చేయడం.. దాని కౌంటర్ ఇస్తూ ఆయన చేసిన కామెంట్లు వివాదానికి దారి తీశాయి.. ఈ ఎపిసోడ్‌లో కూటమి నుంచి ప్రశాంతి రెడ్డి.. వైసీపీ నుంచి ప్రసన్నకు మద్దతు లభించింది.. అయితే, సభ్య సమాజం తల దించుకునేలా నా పై జరిగిన మాటల దాడిని ఖండిస్తూ నాకు అండగా నిలబడిన తెలుగుదేశం కుటుంబసభ్యులకు, ప్రజానీకానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటూ ఓ వీడియో విడుదల చేశారు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి..
Read Also: Exclusive : టాలీవుడ్ ఫ్లాపుల వీరులు.. ఎవరెవరు ఎన్నేన్ని డిజాస్టర్స్ కొట్టారంటే
ఈ కష్ట సమయంలో నాకు అండగా నిలబడిన సీఎం నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిజయేశారు ప్రశాంతి రెడ్డి.. అలాగే మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, సహచర ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, పార్టీ జిల్లా అధ్యక్షులకు, వివిధ హోదాల్లో ఉన్న ఎందరో నేతలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపిన ఆమె.. నా కోసం క్షేత్రస్థాయిలో పోరాటాలు చేసిన మహిళామణులకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా మీద అభిమానంతో మేమున్నామంటూ జిల్లావ్యాప్తంగా తరలివచ్చి నాకు సంఘీభావం ప్రకటించిన వీపీఆర్ అభిమానులకు, కోవూరు నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలకు రుణపడి ఉంటానని పేర్కొన్నారు.. అలాగే నాకు నైతిక మద్దతు అందించిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అన్నారు.. మీ అందరి మద్దతుతో మనోధైర్యాన్ని కూడగట్టుకుని ప్రజలకు మరింత మెరుగైన పాలన అందించేందుకు సర్వదా సిద్ధంగా ఉంటానని తెలియజేస్తున్నాను అంటూ ఆ వీడియోలో పేర్కొన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి..
