Site icon NTV Telugu

MLA Prashanthi Reddy: ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి.. వదిలే ప్రసక్తే లేదన్న ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి..

Mla Prashanthi Reddy

Mla Prashanthi Reddy

MLA Prashanthi Reddy: నెల్లూరులో పొలిటికల్ హీట్‌ పెరిగిపోయింది.. వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి ఇంటిపై దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది.. అయితే, నా ఇంటిని టీడీపీ నేతలు విధ్వంసం చేశారు.. మేం అధికారంలోకొస్తే ఇలాంటి విధ్వంసానికి పాల్పడం.. కానీ, సరైన రీతిలోని బుద్ధి చెబుతాం అని ప్రసన్న కుమార్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.. ఇక, మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడికి తనకి ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి స్పష్టం చేశారు.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి.. తన క్యారెక్టర్ గురించి మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి అసభ్యకరంగా మాట్లాడారు.. ఇప్పటికి ఎన్నోసార్లు తన క్యారెక్టర్ పై తీవ్రమైన విమర్శలు చేసినా.. నేనెక్కడా సహనం కోల్పోలేదన్నారు..

Read Also: Xiaomi Power Bank: ‘పిట్ట కొంచెం కూత ఘనం’ అనేలా.. 20,000mAh కంపాక్ట్ పవర్ బ్యాంక్ లాంచ్..!

ఇక, ప్రసన్నకుమార్‌ రెడ్డి ఇంటిపై జరిగిన ఈ దాడితో నాకు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదన్నారు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి.. దాడి విషయం నాకు తెలిసే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయిందన్న ఆమె.. నాపై అసభ్యకరంగా మాట్లాడటాన్ని జీర్ణించుకోలేక అభిమానులు, మహిళలు దాడి చేశారేమో నాకు తెలియదు అన్నారు.. రాజకీయపరంగానే నేను విమర్శలు చేశాను తప్ప.. ఎక్కడా వ్యక్తిగతంగా విమర్శించలేదన్నారు.. దాడుల సంస్కృతి మాకు లేదు.. ప్రజాసేవ చేయడమే మాకు తెలుసు అని పేర్కొన్నారు.. నాపై చేసిన వ్యాఖ్యలను వైసీపీలో ఉండే మహిళలు సమర్ధిస్తారా..? ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో ఉండే మహిళలు సమర్థిస్తారా..? అంటూ ప్రశ్నించారు కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి..

Read Also: Harrier EV vs Creta EV: హారియర్ లేదా క్రెటా..? ఏ ఎలక్ట్రిక్ మోడల్ బెస్ట్.. ఎందుకు..?

మరోవైపు, మీడియాతో మాట్లాడుతూ.. హాట్‌ కామెంట్లు చేశారు కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి.. తనపై వ్యక్తిగత విమర్శలు వేసిన ప్రసన్న కుమార్ రెడ్డిపై మహిళా కమిషన్ కి ఫిర్యాదు చేస్తా అన్నారు.. ప్రసన్న కుమార్ రెడ్డిని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.. వైసీపీ నేతలు మహిళలపై అసభ్యకరంగా మాట్లాడాలంటే భయపడేలా చర్యలు తీసుకోవాలని కోరతా అన్నారు కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి.

Exit mobile version