NTV Telugu Site icon

Kakani Govardhan Reddy: జగన్ తీసుకొచ్చిన వ్యవస్థ ఉండకూడదనే నిర్వీర్యం చేస్తున్నారు..

Kakani

Kakani

Kakani Govardhan Reddy: అన్నదాతలఫై చంద్రబాబు కక్ష పెంచుకున్నారు అని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. జగన్ తీసుకొచ్చిన రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేశారు.. విత్తనాలు, ఎరువులు దొరక్క రైతులు ఇబ్బంది పడుతున్నారు.. గత ప్రభుత్వంలో ఎకరాకు లక్ష రూపాయలు అదనంగా ఆదాయం వస్తే.. ఇప్పుడు ఎకరానికి రూ. 40 వేల దాకా రైతులు నష్టపోతున్నారు అని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు మాటల్లో తప్ప.. చేతల్లో లేదు అని విమర్శలు గుప్పించారు. టీడీపీ హయాంలోనే రైతులు అనేక ఇబ్బందులు పడుతుంటారు.. టీడీపీ గెజిట్ పత్రికల్లోనే వార్తలు వస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ అన్నారు.

Read Also: Trump: ట్రంప్ మరో కీలక నిర్ణయం.. మిలిటరీలో ట్రాన్స్‌జెండర్ల నియామకంపై నిషేధం

ఇక, మిర్చి రైతులు ధరలు లేక అల్లాడిపోతున్నారు అని కాకాణీ గోవర్థన్ రెడ్డి తెలిపారు. రూ. 6 వేల కోట్ల రూపాయలు మేర మిర్చి రైతులు నష్టపోతున్నారు.. దళారులు దోచుకుంటుంటే.. ప్రభుత్వం చోద్యం చూస్తోంది అని ఆరోపించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదం ఉంది.. అన్నదాత.. సుఖీభవ పథకం అమలు చేయకపోవడం వల్ల.. అప్పులు తెచ్చుకుని రైతులు వ్యవసాయం చేస్తున్నారు.. పెట్టుబడులు పెరిగి.. రాబడి తగ్గడంతో రైతులు అప్పులు ఊబిలో ఇరుక్కొంటున్నారు అని పేర్కొన్నారు. జగన్ తీసుకొచ్చిన వ్యవస్థలు ఉండకూడదనే కక్షతో.. రైతులను చంద్రబాబు రోడ్డున పడేస్తున్నాడు.. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే అన్నదాతలను కలుపుకుని ఆందోళనకు శ్రీకారం చూడతామని మాజీ మంత్రి కాకాణీ హెచ్చరించారు.