Site icon NTV Telugu

Kakani Govardhan Reddy: జగన్ వద్ద ఎలాంటి కొటరీలు లేవు..

Kakani

Kakani

Kakani Govardhan Reddy: మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి ఆరోపణలపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పందించారు. సాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే అన్నారు. వైసీపీ ఆవిర్భావ దినోత్సవం, యువత పోరు విజయవంతమైంది.. ప్రజలను డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేయించి ఉంటారు అని ఆయన తెలిపారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తే ఆ స్థానం కూటమికి దక్కుతుంది.. తెలిసే ఇదంతా విజయ సాయి రెడ్డి చేశారు.. ఇందులో గూడుపుఠాణి ఉందనే అనుమానం కలుగుతోంది అని కాకాణి గోవర్థన్ రెడ్డి పేర్కొన్నారు.

Read Also: Ranya Rao Case: రన్యా రావు కోసం కొత్త కోణం.. పోలీస్ డిపార్ట్‌మెంట్ ప్రమేయం..!

ఇక, విజయ సాయి రెడ్డి, రఘురామ కృష్ణంరాజుల మధ్య రహస్య స్నేహం ఉంది అని మాజీ మంత్రి కాకాణి అన్నారు. లేదంటే సాయి రెడ్డి ఇల్లు ఆయనకు ఎందుకు అద్దెకు ఇచ్చారు అని ప్రశ్నించారు. వ్యవసాయం చేసుకుంటానని చెప్పిన సాయి రెడ్డి చంద్రబాబుకు సాయం చేస్తున్నారు.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దగ్గర ఎలాంటి కోటరీలు లేవు.. ముఖ్యమంత్రిగా జగన్ ఉన్నపుడు సాయి రెడ్డి గంటలు గంటలు ఏకాంతంగా మాట్లాడే వారు.. అలాంటిది ఏ కోటరీ ఉందని చెబుతారు అని కాకాణి గోవర్థన్ రెడ్డి తెలిపారు.

Exit mobile version