NTV Telugu Site icon

Kakani Govardhan Reddy: బీజేపీ, జనసేన నేతలే ప్రభుత్వ విధానాలను విమర్శిస్తున్నారు..

Kakani

Kakani

Kakani Govardhan Reddy: ఎన్నికలలో ఇచ్చిన హామీలకు చంద్రబాబు తిలోదకాలు ఇస్తున్నారని మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల సమయంలో తక్కువ ధరకే నాణ్యమైన మద్యం ఇస్తానని చెప్పి.. బాటిల్ చూపించి పదే పదే చూపించారు.. ఇప్పుడు మద్యం ధరలను పెంచి భారం మోపారు.. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలను ఏర్పాటు చేసింది.. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని రద్దు చేసి టిడిపి నేతలు, కార్యకర్తలకు మద్యం దుకాణాలను ఇచ్చారు అని ఆయన ఆరోపించారు. చాలా ప్రాంతాల్లో ఎంఆర్పీ ధరల కంటే అధికంగా మద్యాన్ని విక్రయిస్తున్నారు.. విచ్చలవిడిగా బెల్ట్ షాపులను ఏర్పాటు చేశారు.. ఇప్పుడు ధరలను పెంచడం వల్ల రూ. 3 వేల కోట్ల మేర అదనపు ఆదాయం వస్తుంది.. టీడీపీ నేతల ప్రయోజనాలకే ఈ విధంగా చేశారు అని కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు.

Read Also: Sheldon Jackson: ప్రొఫెషనల్ క్రికెట్‌కు భారత క్రికెటర్ రిటైర్మెంట్..

ఇక, వాట్సాప్ గవర్నెన్స్ తెచ్చి ఇంటికే మద్యాన్ని డెలివరీ చేస్తున్నారు అని మాజీ మంత్రి కాకాణి ఆరోపించారు. లక్కీ డిప్ లు పెట్టి విదేశాలకు పంపుతామని చెప్పి మద్యాన్ని విక్రయిస్తున్నారు.. బీజేపీ, జనసే నేతలే ప్రభుత్వ విధానాలను విమర్శిస్తున్నరు.. ఈ పార్టీల ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో కూడా టీడీపీ నేతలే పెత్తనం చేలాయిస్తున్నారు.. గ్రామాల్లో పేకాట క్లబ్బులు విస్తరిస్తున్నాయి.. అనధికార బార్లను నిర్వహిస్తున్నారు.. వీటిపై అధికారులకు పూర్తి స్థాయిలో ఆధారాలు ఇస్తున్నా స్పందించడం లేదు అని కాకాణి గోవర్థన్ రెడ్డి పేర్కొన్నారు.